twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఫ్రెండ్ కి ఇది డబుల్ బొనాంజానే

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరద్ మరార్ ఇప్పుడు పూర్తి సంతోషంగా ఉన్నారు. నిర్మాతగా ఆయన తొలి సినిమా మొదలు కాకుండానే డబుల్ బొనాంజా సాధించారంటున్నారు. ఓ ప్రక్క గబ్బర్ సింగ్ 2 నిర్మాణం మొదలుకాకుండానే ఆయన ఓ మైగాడ్ చిత్రం రీమేక్ కి సైతం నిర్మాతగా వ్యవహించే అవకాసం రావటం అదృష్టమే అంటున్నారు. పవన్ తో ఓ చిత్రం ఓకే అయ్యిందంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఆ నిర్మాతకి పండగే. అత్తారింటికి దారేది చిత్రంతో ఆ నిర్మాతకి అప్పులన్నీ తీరిపోయి ఒడ్డునపడ్డారు. ఎందుకంటే పవన్ తో సినిమా ప్రకటించగానే బిజినెస్ మొదలైపోతుంది.

    'అత్తారింటికి దారేది' తరవాత పవన్‌ కల్యాణ్‌ సినిమా ఏదీ సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ కొత్త సినిమా కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. కొత్త కథలు పవన్‌ వింటున్నారు. పవన్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్‌ పచ్చజెండా వూపింది రెండు సినిమాలకే. 'గబ్బర్‌ సింగ్‌ 2'తో పాటు, 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌ని ఒప్పుకొన్నారు.

    'ఓ మైగాడ్‌'లో వెంకటేష్‌తో కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఈ రెండు చిత్రాలూ ఇంచుమించు ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్నాయి. త్వరలోనే 'గబ్బర్‌ సింగ్‌ 2' సెట్స్‌పైకి వెళ్లనున్నదని నిర్మాత శరత్‌మరార్‌ చెబుతున్నారు. 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌కీ ఈయనే నిర్మాత. సురేష్‌ బాబుతో కలిసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 'గబ్బర్‌సింగ్‌ 2', 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌ ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.

    NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ మీడియా రంగంలో మంచి పేరు సంపాదించారు. చాలా కాలంగా పవన్ కి మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. శరద్ మరార్ గతంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసారు. ఆయన కెరీర్ ..అమితాబ్ కు చెందిన ఎబిసిఎల్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ గా మొదలెట్టారు.

    మరో ప్రక్క శరత్ మరార్... చిత్ర సీమ అనే కొత్త ఛానెల్ ని NTV ఆధ్వర్యంలో మొదలు పెట్టానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యులైన కొందరు నిర్మాతలు ఈ ఛానెల్ లో భాగస్వాములుగా ఉండి మరీ ఈ ఛానెల్ ని తెస్తున్నారని తెలుస్తోంది. శరద్ మరార్ గతంలో మాటీవిలోనూ మంచి రేటింగ్స్ తెచ్చారని, ఇప్పుడు ఈ కొత్త తెలుగు సినీ ఛానెల్ ను కూడా ఆయన నిలబడతారని భావిస్తున్నారు. ఇక శరద్ మరార్ కి మొదటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి. పవన్ స్నేహితుడుగానే కాకుండా ఆయన పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.

    English summary
    Debutant producer Sarath Marar and ex-CEO of MAA TV, would producing not one but two films, with his friend and mentor Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X