Bigg Boss Telugu 8: ఈ వారం డబుల్ ఎలిమినేషన్?.. బిగ్‌బాస్ దత్త పుత్రిక రీ ఎంట్రీ!
బిగ్‌బాస్ తెలుగు 8 ఊహకందని ట్విస్టులతో సాగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మందిని పంపిన బిగ్‌బాస్.. ఆటను మరింత రక్తి కట్టించేలా ప్లాన్స్ వేస్తున్నాడు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన నాగ మణికంఠ వెళ్లిపోవడంతో అతని అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని సెట్ చేసిన బిగ్‌బాస్.. హాట్ హాట్ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు మరో స్కెచ్ వేశాడు. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని మరోసారి తీసుకురానున్నాడు. అంతేకాదు.. ఈ వీక్ మరో షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంటుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే ..
14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 8లో బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీతలు ఇప్పటికే హౌస్‌ను వీడగా.. 7వ వారంలో నాగ మణికంఠ అనారోగ్యం కారణంగా చూపి తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయ్యిందని భావించిన బిగ్‌బాస్ 5వ వారం చివరిలో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపించాడు. గంగవ్వ, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణలు లోపలికి ఎంట్రీ ఇచ్చారు.

పాత కంటెస్టెంట్స్‌ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ క్లాన్ ), వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులను రాయల్ క్లాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఓజీ క్లాన్‌లో ప్రస్తుతం నిఖిల్, ప్రేరణ, యష్మీగౌడ, నబిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ మాత్రమే మిగిలారు. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుండటంతో ఓజీ క్లాన్ బలాన్ని పెంచాలని బిగ్‌బాస్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన కిర్రాక్ సీతను ఈ వారం వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపుతారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

బిగ్‌బాస్ దత్తపుత్రికగా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల.. పృథ్వీ, నిఖిల్‌లను అడ్డుపెట్టుకుని ఆట ఆడింది. చివరికి అదే ఆమె కొంపముంచి ఎలిమినేషన్‌కు కారణమైంది. అయితే పాయింట్‌పై ఆర్గ్యూమెంట్ చేయడంలో సోనియా దిట్ట. ఇలాంటి వారు లేకపోవడంతో బిగ్‌బాస్‌లో ఈ కేటగిరీ వీక్ అయ్యింది. ఈ క్రమంలోనే సోనియా ఆకుల రీ ఎంట్రీని ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె వ్యక్తిత్వంపై నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో తల్లిదండ్రులు కాస్త ఫీల్ అవుతున్నారట. ఈసారి నెగిటివ్ ట్రోలింగ్ జరగకుండా చూసుకుంటారనే హామీ మీద సోనియా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హౌస్‌లో ఇప్పటికే 14 మంది వరకు ఉండటంతో జనాన్ని కంట్రోల్ చేసే ప్లాన్ కూడా బిగ్‌బాస్ టీమ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ మిడ్ ఒకరు, వీకెండ్‌లో మరొకరిని బయటికి పంపుతారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఈ వారం నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, నయని పావని, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











