పెళ్లికి హీరో రామ్ గ్రీన్ సిగ్నల్.. అమ్మాయి ఎవరో కాదు ఆమెనే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో రామ్ పోతినేని. అలా చాలా కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూనే ఉన్నాడు. ఇలా తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నాలను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ పోతినేని పెళ్లి గురించి ఓ ఊహించని న్యూస్ వైరల్‌గా మారిపోయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
అలా ఎంట్రీ.. ఫుల్ జోష్
'దేవదాసు' అనే సినిమాతో రామ్ పోతినేని హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి చిత్రమే సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. దీంతో మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ రేంజ్ మరింతగా పెరిగింది.

డబుల్ ఇస్మార్ట్ అంటూ
ఈ మధ్య కాలంలో రామ్ పోతినేని ఆశించిన రీతిలో విజయాలను అందుకోవడం లేదు. అతడు నటించిన 'ది వారియర్', 'స్కంద' సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రామ్ పెళ్లిపై ప్రచారం
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు. ముఖ్యంగా శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి హీరోలు వైవాహిక జీవితాన్ని ప్రారంభించేశారు. దీంతో చాలా రోజుల నుంచే రామ్ పెళ్లి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడు ఫలానా అమ్మాయితో ఏడు అడుగులు నడవబోతున్నాడని వార్తలను వైరల్ చేస్తున్నారు.

హీరో రామ్ పెళ్లి ఫిక్స్
సినిమా పరంగా దూసుకుపోతోన్న హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడి వివాహం గురించి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని ప్రకారం.. హీరో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని కూడా ఒక సమాచారం చక్కర్లు కొడుతోంది.
రామ్ పెళ్లాడేది ఆమెనే
హీరో రామ్ పోతినేని సినీ రంగానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం.. అతడు హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ బిజినెస్‌మ్యాన్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడట. ఆమె పేరు మీద ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా రాబోతుందని టాక్.

అసలు ఎప్పుడంటే
ఫిలిం నగర్ ఏరియాలో తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. హీరో రామ్ పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆ వెంటనే అంటే డిసెంబర్ నాటికి వీళ్లిద్దరి వివాహం కూడా జరిపించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











