twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమ్లా నాయక్ ను సంక్రాంతికి రాకుండా చేస్తున్న అంశాలు.. అవి జరిగితే పక్కా!

    |

    పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ సినిమాను వాయిదా వేసుకోవాలని కోరడంతో వాయిదా వేయక తప్పలేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని RRR సినిమా వాయిదా పడడంతో భీమ్లా టీమ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయొచ్చు కానీ.. కొన్ని అంశాలు ఆ సినిమాను రాకుండా చేస్తున్నాయి.

    ఐదోసారి వాయిదా..

    ఐదోసారి వాయిదా..

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి పెద్ద పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి తప్పకుండా RRR సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా ఓమిక్రాన్ దెబ్బ తగలడంతో RRR సినిమా ఫైనల్ గా ఐదోసారి కూడా వాయిదా పడింది.

    పోటీ ఉండకూడదు అని..

    పోటీ ఉండకూడదు అని..

    RRR సినిమాకు ఎవరు పోటీ గా ఉండకూడదు అని దర్శకుడు రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకవైపు ప్రమోషన్ చేస్తూనే మరోవైపు పోటీలో ఉన్న పెద్ద సినిమాలను సంక్రాంతి రేసులో నుంచి తప్పించారు. ముఖ్యంగా అందరికంటే ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసింది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను కూడా వాయిదా వేయించారు.

    పరిస్థితుల వలన..

    పరిస్థితుల వలన..

    అందరినీ వాయిదా వేయించిన దర్శకుడు రాజమౌళి హఠాత్తుగా పరిస్థితులను బట్టి తన సినిమాకు కూడా వాయిదా వేయించారు. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే థియేటర్లు కొనసాగుతున్నాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అయితే RRR సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా కోరినందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను వాయిదా పడేలా చేశారు.

    నెమ్మదిగా సాగిన పనులు..

    నెమ్మదిగా సాగిన పనులు..

    భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చాలా పక్క ప్లానింగ్ తోనే పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే రాజమౌళి ఈ సినిమాను వాయిదా వేసుకోవాలని చెప్పాడో అప్పటి నుంచి యూనిట్ నెమ్మదిగా పని చేసుకుంటోంది. ఫిబ్రవరిలో విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి న్యూ ఇయర్ కి కూడా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

    అవన్నీ జరిగితే..

    అవన్నీ జరిగితే..

    ప్రస్తుతం భీమ్లా నాయక్ పనులు చాలావరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక సాంగ్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా థమన్ కూడా కొన్ని అతి ముఖ్యమైన సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేయాల్సి ఉంది. ఇవన్నీ పనులు పూర్తి కావాలంటే కనీసం మూడు వారాలకు పైన పడుతుంది. ఎంత త్వరగా పూర్తి చేసినా కూడా సంక్రాంతికి సిద్ధం చేయడం అంటే చాలా కష్టమే అని చెప్పాలి. ఒకవేళ ఆ పనులు అన్నీ కూడా ఫినిష్ అయితే మాత్రం సంక్రాంతి రేస్ లో భీమ్లా ఉంటాడు అని చెప్పవచ్చు.

    English summary
    Doubtful chance for Bheemla nayak in sankranthi race..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X