»   » వెంకటేష్, తేజ మూవీ.. డౌట్లు మొదలయ్యాయి, ఏం జరుగుతోంది?

వెంకటేష్, తేజ మూవీ.. డౌట్లు మొదలయ్యాయి, ఏం జరుగుతోంది?

Subscribe to Filmibeat Telugu

విక్టరీ వెంకటేష్ గురు చిత్రం తరువాత బాగానే గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీ హీరోగా మారిపోతున్నాడు. ఏకంగా మూడు చిత్రాలు వెంకీ కోసం క్యూలో ఉన్నాయి. వెంకటేష్, తేజ చిత్రం త్వరలో మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రంపై అనేక అనుమానాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత దర్శకుడు తేజకు మంచి డిమాండ్ ఏర్పడింది. వెంకీ చిత్రంతో పాటు తేజా క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా టేకప్ చేశారు.

తేజ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవుతున్న నేపథ్యంలో వెంకీ చిత్ర స్క్రిప్ట్ వర్క్ అవుతున్నట్లు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేష్ బాబు నిర్మాత.స్క్రిప్ట్ లో మార్పులని ఆయన సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తేజ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడంతో ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే క్లారిటీ రావడం లేదు.

Doubts on Venkatesh, Teja movie

ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచి తనకోసం ఎదురుచూస్తున దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా ప్రారంభించాలనే ఆలోచనలో వెంకీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు దర్శకుడు బాబీ కూడా వెంకీ కోసం ఎదురుచూస్తున్నాడు. బాబీ వెంకీ, నాగచైత్యాన్యతో మల్టి స్టారర్ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Doubts on Venkatesh, Teja movie. Anil Ravipudi and Bobby waiting for Venkatesh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X