చిరు, రాజశేఖర్ ల మధ్య రాజీ

By Srikanya

చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య చాలా కాలంగా సాగుతున్న యుద్దానికి విరమణ జరిగినట్లే అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇద్దరి మధ్య ఓ పెద్ద నిర్మాత మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చాడని చెప్పుకుంటున్నారు.పాలిటిక్స్ లోనూ,సినీ పరిశ్రమలోనూ శాశ్వత మిత్రులు కాని,శాశ్వత శత్రువులు గానీ ఉండరని ఈ సంఘటనతో నిరూపించినట్లు అవుతోంది.ఇక ఈ రాజీ కుదిరాకే దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నెగిటివ్ రోల్ చేయటానికి ఓకే చేసాడని చెప్తున్నారు.వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రామ్‌చరణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X