హీరో రాజశేఖర్‌పై పోలీసుల చర్య.. ఏకంగా లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం!

హీరో రాజశేఖర్ పై పోలీసులు చర్య తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన కారు ప్రమాదాలపై విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు చివరకు ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. వరుస ఘటనల నేపథ్యంలో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసే కోణంలో పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ రోజు రాత్రి పీవి ఎక్స్‌ప్రెస్ హైవేపై

ఆ రోజు రాత్రి పీవి ఎక్స్‌ప్రెస్ హైవేపై

2017 అక్టోబ‌ర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలననే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Recommended Video

Hero Rajasekhar Met With A Car Mishap || హీరో రాజశేఖర్‌ కారు బోల్తా! ||
త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో

త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో

దీంతో రాజశేఖర్ పై పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల‌న ఆ మ‌త్తులో కారు యాక్సిడెంట్ చేశాడ‌ని అన్నారు. 'గ‌రుడవేగ' చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఈ యాక్సిడెంట్ జ‌రిగింది.

రీసెంట్‌గా శంషాబాద్.. రాజ‌శేఖ‌ర్ కారు భీభత్సం

రీసెంట్‌గా శంషాబాద్.. రాజ‌శేఖ‌ర్ కారు భీభత్సం

ఇక రీసెంట్‌గా శంషాబాద్ పెద్ద గోల్కొండ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు మూడు ప‌ల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే. స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో రాజశేఖర్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. రాజ‌శేఖ‌ర్ కారు డివైడ‌ర్‌ని ఢీకొట్టి అవ‌తలి వైపుకి ప‌ల్టీలు కొట్టుకుంటూ వెళ్ల‌గా, ఆ స‌మ‌యంలో ఎలాంటి వాహ‌నాలు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదమే త‌ప్పింది.

పోలీసుల సీరియస్.. ఆర్టీఏకి లేఖ

పోలీసుల సీరియస్.. ఆర్టీఏకి లేఖ

ఈ నేపథ్యంలో ఈ కేసులను చాలా సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తాజా సమాచారం. రాజ‌శేఖ‌ర్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్ప‌టికే ఆర్టీఏకి లేఖ కూడా రాశార‌ట‌. దీంతో మ‌రి కొద్ది రోజుల‌లోనే ఆయ‌న లైసెన్స్ ర‌ద్దు కానుందని తెలుస్తోంది. ట్రాఫిక్ చ‌ట్టాల‌ని రెండు మూడు సార్లు ఉల్లంఘించిన నేప‌థ్యంలో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణ‌యం మంచిదేన‌ని జ‌నాలు అంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X