Rajasekhar Remuneration: రాజశేఖర్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. బైకర్ మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?

తెలుగుతెరపై యాంగ్రి యంగ్‌మెన్‌గా, యాక్షన్ హీరోగా ఒకప్పుడు తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌తో వెలుగొందారు డాక్టర్ రాజశేఖర్. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ, రొమాంటిక్ మూవీస్‌తోనూ రాజశేఖర్ అలరించారు. అయితే ఇదంతా ఇప్పుడు గతం.. వరుస ఫ్లాపులు, అనారోగ్య సమస్యలతో రాజశేఖర్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆపరేషన్ గరుడ వేగ, కల్కి సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా మళ్లీ ఫ్లాపులు ఎదురుకావడంతో ఆయన వెనుకబడ్డారు.

ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న బైకర్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు డాక్టర్ రాజశేఖర్. ఈ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్‌లలో రాజశేఖర్ లుక్, గెటప్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైకర్ మూవీకి గాను ఆయన పారితోషకం ఎంత? అనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

Dr Rajasekhar Remuneration for sharwanand s Biker Movie Creates Buzz in Tollywood

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా ఈ బైకర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ వైబోధ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పలాస ఎడిటిర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా బైకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న శర్వానంద్ కెరీర్‌లో ఎన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజైన శర్వానంద్ పోస్టర్స్, లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కెరీర్‌లో తొలిసారిగా ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో ఆయన నటిస్తున్నారు. శర్వానంద్‌కు కోచ్‌గా రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన రాజశేఖర్ తనకు అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. బైకర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మంచి కథ ఉంటే హీరోగా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేద్దామని అనుకున్నా. రెండు మూడేళ్ల పాటు స్క్రిప్ట్‌లు విన్నప్పటికీ నాకు నచ్చలేదు. అయితే బైకర్ కథ నాకు నచ్చి ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నానని రాజశేఖర్ తెలిపారు. ఇదే తరహా కథలు వచ్చి.. సబ్జెక్ట్ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను, నేను మారిపోయాను కాబట్టి నాకు మీ సినిమాలలో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని రాజశేఖర్ రిక్వెస్ట్ చేయడం కలకలం రేపింది.

ఇదిలాఉండగా.. బైకర్ మూవీకి గాను డాక్టర్ రాజశేఖర్ పారితోషికం తీసుకున్నారనేది చర్చనీయాంశమైంది. ఒకప్పుడు హీరోగా చేసిన రాజశేఖర్‌.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడంతో రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఫిలింనగర్‌ వర్గాల సమాచారం ప్రకారం డాక్టర్ రాజశేఖర్‌కు బైకర్ నిర్మాతలు దాదాపు 3 కోట్ల రూపాయల్ని రెమ్యునరేషన్‌గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఇమేజ్, ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: dr rajasekhar sharwanand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X