Dragon : ఎన్టీఆర్‌కు డ్రాగన్ తలనొప్పి.. గట్టిగానే తమిళ హీరో దెబ్బ!
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'డ్రాగన్'. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. తమిళంతో పాటు తెలుగు స్టేట్స్ లోనూ ఈ చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' గా విడుదలైంది. తమిళంతో పాటు ఇక్కడ కూడా మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందీ చిత్రం. యూత్ కు బాగా నచ్చడంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగ్గ ఉండటంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.111 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 'డ్రాగన్' కేవలం పదిరోజుల్లే 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా వసూళ్లు కొనసాగిస్తోంది.
అయితే, డ్రాగన్ చిత్రం హీరో ప్రదీప్ రంగనాథన్ అంట ప్రస్తుతం ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. క్రేజీ టైటిల్ ను ప్రదీప్ రంగనాథన్ వాడేసుకొని సెన్సేషన్ ఫిల్మ్ ను థియేటర్లలో దించాడు. తమిళంలోనే కాకుండా తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ టైటిల్ బాగా నచ్చడం విశేషం. కాగా గతం నుంచే జనాల నోళ్లలో నానిన టైటిల్ ఇది. క్యాచీగానూ ఉండటం, పైగా ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, మంచి కంటెంట్ తో థియేటర్ల లోకి రావడంతో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.

అయితే.... ఏ సినిమా వచ్చినా ముందు క్యాచీ టైటిల్ ను పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఎంతగానో రీసెర్చ్ చేస్తారు. కంటెంట్ కు మ్యాచ్ అయ్యే చూస్తారు. మరోవైపు ఒక సినిమాకు టైటిల్ ను అనుకోగా.. అదే టైటిల్ తో సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. సినిమా ఆడకపోతే పర్లేదు మళ్లీ ట్యాగ్ లైన్స్ తో టైటిల్ ను కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ టైటిల్ తో హిట్ అయితే మాత్రం యూజ్ చేసే ఛాన్స్ ఉండదు. ఎట్టిపరిస్థితుల్లో టైటిల్ ను మార్చాల్సిందే.
అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఎదురైంది. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మూలంగానే.. ఎలాగంటే.. ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం 'డ్రాగన్' చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్, ఎన్టీఆర్ - నీల్ సినిమాకు కూడా 'డ్రాగన్' టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కు ఈ టైటిల్ కరెక్ట్ ఉంటుందని భావించారు. ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్31 భారీ ప్రాజెక్ట్ కు సరిగ్గా సరిపోతుందని ఫిక్స్ అయ్యారు. 'డ్రాగన్' టైటిల్ తోనే ఆ ప్రాజెక్ట్ ను పిలుచుకుంటున్నారు.
ఈలోగా ఫిబ్రవరి 21న ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' టైటిల్ తోనే థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ పై బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు కూడా ఉన్నాయి. ఇంకా చిత్రం వసూళ్లు రాబడుతూనే ఉంది. దీంతో ఎన్టీఆర్31కు అనుకున్న టైటిల్ ను మారుస్తారా? లేకా అదే టైటిల్ ను కొనసాగిస్తారా? ఇప్పటికే మరేదైనా టైటిల్ ను ఫిక్స్ చేశారా? అనేది ఇంకొన్నాళ్లు ఆగి చూడాలి. మొత్తానికి ప్రదీప్ రంగనాథ్ ఇచ్చిన షాక్ కు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కు టైటిల్ ను ఫిక్స్ చేయడంలో కాస్తా తలనొప్పి చెప్పించిందనే ప్రచారం కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజే 3000 వేల మందితో యాక్షన్ సీన్ ను చిత్రకరించారు.
గతంతో పోల్చితే ఇప్పుడు ఆడియెన్స్ దృష్టిని మరల్చేందుకు, సినిమాకు మంచి ప్రమోషన్ రావాలన్నా టైటిల్స్ ప్రాధాన్యత లేకపోలేదు. సరళమైన, కాస్తా క్రేజీగా ఉండే టైటిల్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. అందుకని చాలామంది సినీ రైటర్స్, ప్రొడక్షన్ కంపెనీలు కూడా పాపులర్ టైటిల్స్ ను మండలిలో ముందే రిజిస్టర్ చేయించుకొని ఉంటారు. వెసులుబాటు ఉండి అవసరమైతేనే ఇతరులకూ ఆ టైటిల్ ను ఇచ్చేస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబోలో రూపుదిద్దుకున్న 'కుబేరా' టైటిల్ వివాదంలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











