రుక్మిణి వసంత్ కల నెరవేరినట్టేనా? స్టార్ హీరో సినిమాలో అలా..

ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చాలా బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ ల్లో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఒకరు. 'సప్త సాగరాలు దాటి'సినిమాతో నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈ కన్నడ భామ, ఆ తర్వాత భారీ ప్రాజెక్టులతో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ముఖ్యంగా కాంతార సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. దీంతో వరుస భారీ సినిమా అవకాశాలను అందుకుంటుంది. అందులో యశ్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్'వంటి పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయితే.. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె కల కూడా నెరవేరబోతుందట.

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందబోయే కొత్త సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'దండోరా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, కథానాయిక పాత్ర కోసం రుక్మిణిని సంప్రదించగా ఆమె అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Dragon heroine Rukmini Vasanth Joins Nani s Production Buzz Grows Around Wall Poster Cinema Project

ఈ వార్తకు మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ తనకు తెలుగులో అత్యంత ఇష్టమైన హీరో నాని అని చెప్పడం. నాని చేసే సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం ఉంటుందని, ప్రతి కథలో ఒక అర్థవంతమైన అంశం దాగి ఉంటుందని, ఆయన నటన తనకు ఎంతో ఇష్టమని అప్పట్లో వెల్లడించింది. అంతేకాదు, అవకాశం వస్తే నానితో కలిసి పనిచేయాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు నాని నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే సినిమాలో ఆమెకు అవకాశం రావడం యాదృచ్ఛికమే అయినా, అభిమానులు మాత్రం "రుక్మిణి కల నెరవేరింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మూవీ మేకర్స్ ప్రస్తుతం కథకు తగిన హీరో ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హీరో ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు దర్శకుడు మురళీకాంత్ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతూ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాని నిర్మాతగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్నారు. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా కొత్త కథలను, ప్రతిభావంతులైన దర్శకులను ప్రోత్సహించడం ఆయన నిర్మాణ సంస్థ ప్రత్యేకతగా నిలిచింది. హిట్, హిట్ 2, కోర్ట్, మీట్ క్యూట్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. అందుకే వాల్ పోస్టర్ సినిమా నుంచి వచ్చే ప్రతి కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మురళీకాంత్ దర్శకత్వం, నాని నిర్మాణం, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ హీరోయిన్ కలయికతో రూపొందబోయే ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.

Read more about: nani rukmini vasanth tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X