Dragon: ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న ఫార్ములాతో ప్రశాంత్ నీల్
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న పాన్-ఇండియా మూవీ డ్రాగన్ (Dragon). ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా ఇట్టే సోషల్ మీడియాలో హాల్ చల్ గా మారుతోంది. అలా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్లతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈసారి ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు రవి బసూరుర్ అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలవనుందని అంచనాలు ఉన్నాయి.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. వార్ 2 తర్వాత ఎన్టీఆర్‌తో అనిల్ కపూర్ నటించడం రెండో సారి. అలాగే, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)మరో ఫీమేల్ లీడ్‌గా ఇప్పటికే ఖరారైంది. వివిధ ఇండస్ట్రీల నుంచి మరికొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్.
అలా తాజాగా ఒలివియా మోరిస్ (Olivia Morris) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారన్నట. ఈ అమ్మడు గతంలో RRRలో నటించింది. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్- ఒలివియా మోరిస్ జోడీ మళ్లీ తెరపై కనిపించనుందన్న టాక్ వైరల్ అవుతోంది. RRR సినిమాలో జెన్నీ పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఒలివియా మోరిస్.. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌తో ఉన్న కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డ్రాగన్ లోనూ రిపీట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ కాంబినేషన్ ఖాయమైతే సినిమాకు గ్లోబల్ వైస్ గా మరింత హైప్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించిన ట్రెండ్‌ను ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అవుతున్నాడా అన్న ప్రశ్న. బాహుబలితో సీక్వెల్ ట్రెండ్, హాలీవుడ్ టాలెంట్‌ను ఇండియన్ సినిమాల్లోకి తీసుకురావడం వంటి అంశాలకు రాజమౌళి కొత్త దారిని చూపించారు.
అదే ఫార్ములాను ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్లో అమలు చేస్తున్నాడన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొదట ఈ కథను ఒకే సినిమాగా ప్లాన్ చేసినా, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ తర్వాత రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారని సమాచారం. ఈ విషయంలో కూడా రాజమౌళి బాటలోనే ప్రశాంత్ నీల్ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. డ్రాగన్ మూవీ జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద రిలీజ్‌లలో ఇది ఒకటిగా నిలవనుందని అంచనా. హాలీవుడ్ టచ్, భారీ స్కేల్ అన్ని అంశాలతో డ్రాగన్ భారతీయ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయనుందన్నదని ఇండస్ట్రీ నమ్ముతుంది.


Click it and Unblock the Notifications











