‘డ్రాగన్’గా మారుతున్న ఎన్టీఆర్.. దీని వెనుక రహస్యం తెలిస్తే మైండ్ బ్లాకే!
ఒకప్పుడు వరుసగా పరాజయాలతో సతమతమైనా 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ఈ బడా హీరో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే మూవీని కూడా చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది లేట్ అవుతూనే ఉంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేట్ అవబోతుందనే టాక్ వినిపిస్తోంది.
హై ఓల్టేజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. కానీ, ఇది మాత్రం జరగలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తూనే ఉన్నాడని తెలిసింది. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఈ చిత్రం కోసం టైటిల్‌ను ఫైనల్ చేసేశాడట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి 'డ్రాగన్' (Dragon Title Fix For NTR) అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలిసింది. ఇప్పటికే నిర్మాతలు దీన్ని ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పేరును రివీల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











