అయోమయంలో టాప్ డైరెక్టర్ శంకర్.. రూ.250 కోట్లు నష్టం.?
టాప్ డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు ఎలాంటి చిత్రాలు తీసుకొచ్చారో తెలిసిందే. ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎంతో మంది స్టార్ హీరోలు ప్రయత్నించే వారు. సందేశాత్మక చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఆయన దిట్ట. మరోవైపు టెక్నాలజీని ఆయనకంటే ఎవరూ బాగా వాడుకోలేరని చెప్పడం అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ 'రోబో' చిత్రంతో శంకర్ ఎంతటి సెన్సేషన్ క్రియట్ చేశారో అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం తర్వాత నుంచి శంకర్ కు పెద్దగా హిట్స్ పడటం లేదు.
భారీ స్థాయిలో ప్రాజెక్ట్స్ సెట్ అవుతున్నా.. ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ క్రమంలో శంకర్ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాక్ వినిపిస్తోంది. కెరీర్ లో శంకర్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాలను చేకూర్చాయి. 'జెంటిల్ మెన్', 'ఇండియన్', 'జీన్స్', 'నాయక్', 'బాయ్స్', 'రోబో', 'అపరిచితుడు', 'శివాజీ', '3 ఇడియట్స్', 'ఐ' వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి.

శంకర్ దర్శకత్వం వహించిన గత చిత్రాలతో నిర్మాతలకు మంచి లాభాలు చేకూరాయి. దాంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానూ, ఇండియాలో టాప్ డైరెక్టర్ గానూ గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటి శంకర్ కు ప్రస్తుతం కెరీర్ లో గడ్డు పరిస్థితి ఏదురవుతోంది. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన శంకర్ ఇప్పుడు ఫ్లాప్స్ ను రుచిచూస్తున్నారు. వరుసగా బిగ్ డిజాస్టర్స్ పడటంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు నిర్మాతలెవ్వరూ ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
శంకర్ నుంచి చివరిగా 'ఇండియన్ 2', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యాయి. శంకర్ అభిమానులు, అటు కమల్ హాసన్, రామ్ చరణ్ అభిమానులు ఈ చిత్రాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా శంకర్ ఈ చిత్రాలను పూర్తి చేసి రిలీజ్ చేయించారు. ఇండియన్ 2 చిత్రం కోసం రూ.300 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైంది... తీరా రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ తో రూ.150 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి రూ.150 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ను తెరకెక్కించిన శంకర్ కూ మళ్లీ ఎదురుదెబ్బె తగిలింది. పొలిటికల్ యాక్షన్ గా వచ్చిన ఈ చిత్రం సందేశాత్మకంగా ఉన్నప్పటికీ ఎందుకో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. మౌత్ పబ్లిసిటీ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం పరాజయం పాలైంది. గేమ్ ఛేంజర్ కు రూ.350 నుంచి రూ.425 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారంట. కానీ రిటర్న్ లో రూ.170 కోట్ల వసూళ్లు మాత్రమే అందాయంట.
ఇలా ఈ రెండు చిత్రాలకు కలిపి శంకర్ ని నమ్ముకున్న నిర్మాతలకు రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని టాక్ వినిపిస్తోంది. దీని వల్ల శంకర్ ఇప్పటికే ప్రకటించిన 'ఇండియన్ 3'కి పెట్టుబడి పెట్టేందుకు మరే నిర్మాత సాహసించడం లేదని తెలుస్తోంది. పైగా 'ఇండియన్ 2'కి క్రిటిక్స్ గట్టిగానే వడ్డించడంతో పార్ట్ 3పై అంచనాలు తగ్గాయంటున్నారు. ఫలితంగా ఇప్పట్లో ఇండియన్ 3 పట్టాలెక్కే అవకాశం లేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











