మహేష్ వెంట పడుతున్న సీనియర్ దర్శకుడు.. ఛాన్స్ దొరకడం కష్టమే?
మహేష్ బాబుకు ఒకసారి హిట్టిస్తే వెంటనే ఆ దర్శకుడితో మరో సినిమా చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ ప్లాప్ ఇస్తే మాత్రం మళ్ళీ ఆ దర్శకుల జోలికి వెళ్లరనే టాక్ ఉంది. సినిమా రిజల్ట్ విషయంలో మహేష్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాడని అందరికి తెలిసిందే. సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని పూర్తిగా న్యాయం చేస్తాడు. దర్శకుడిని చాలా గట్టిగానే నమ్మే మహేష్ ఫామ్ లో లేని దర్శకులకు కొంతం దూరంగా ఉంటాడనే కామెంట్స్ కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.
అయితే గతంలో మహేష్ కి ఒక హిట్టు ఇచ్చి ఫామ్ కోల్పోయిన దర్శకుడు మళ్ళీ ఇప్పుడు మహేష్ డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. దూకుడు సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్ స్థాయిని పెంచిన శ్రీను వైట్ల. ఆ సినిమా హిట్టవ్వడంతో మరో ఆఫర్ ఇవ్వగా ఆగడు అనే సినిమా తీశాడు. అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

అనంతరం మరికొన్ని సినిమాలతో శ్రీను వైట్ల బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్నాడు. మొత్తంగా శ్రీను వైట్ల ఫామ్ కోల్పోవడంతో అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు భయపడుతున్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం డీ సీక్వెల్ కి కథను సిద్ధం చేస్తున్న ఈ దర్శకుడు మరో ప్రాజెక్టును కూడా ముందే లాక్ చేసుకోవాలని మహేష్ బాబు డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ ఆ దర్శకుడి ఆఫర్ కి ఇంకా ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. నెక్స్ట్ మహేష్ సర్కారు వారి పాట అనే సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











