త్రివిక్రమ్ దృష్టిలో పడిన దుల్కర్ సల్మాన్.. ఆ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ ప్లాన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా తమిళ హీరోలకు మంచి గుర్తింపు అయితే లభిస్తోంది. అయితే మంచి కంటెంట్ తో వచ్చే ఏ హీరోలైనా సరే భాషతో సంబంధం లేకుండా ఇక్కడ అభిమానులను సొంతం చేసుకుంటారు అని ఇటీవల కాలంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. కాంతార కేజీఎఫ్ సినిమాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు.
అతను మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక సీతారామం సినిమా కూడా అతనికి తెలుగులో మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అంచనాలను అందుకునే విధంగా ఉండాలి అని దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగు దర్శకులతో మరిన్ని కథలను వింటున్నాడు. అయితే ఇంతవరకు కూడా అతనికి నచ్చే విధంగా ఏ దర్శకుడు కూడా అద్భుతమైన కథ చెప్పలేదట.

అయితే త్రివిక్రమ్ సలహా మేరకు మాత్రం ఒక కథపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ధనుష్ తో సార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి మరో కథను కూడా రెడీ చేసుకున్నట్లు టాక్. అయితే ఆ కథ త్రివిక్రమ్ కు బాగా నచ్చడంతో దుల్కర్ సల్మాన్ అయితే ఈ కథకు బాగా సెట్ అవుతాడు అని అతనికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దుల్కర్ కూడా మొదట మెయిన్ కథ గురించి తెలుసుకొని కాస్త పాజిటివ్ గానే స్పందించాడట.
అయితే పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మరోసారి ఈ కథ గురించి మాట్లాడదామని కూడా చెప్పాడట. త్రివిక్రమ్ తన హోమ్ బ్యానర్ ఫార్చూన్ 4, సీతార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి గత కొంతకాలంగా కొన్ని సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సార్ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ తో కలిసి త్రివిక్రమ్ నిర్మించారు. ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ ను కలిపి ఒక సినిమాను నిర్మించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారు. కథ ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











