టాలీవుడ్‌లో సంచలన కాంబినేషన్: బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో.. ఏంటి ఇది మల్టీస్టారర్ మూవీనా!
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ మంచి ఊపులో ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). అందుకే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా త్వరలోనే బాలయ్య.. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా హీరో? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
భగవంత్ కేసరితో హ్యాట్రిక్
'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ఇటీవలే 'భగవంత్ కేసరి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి అదిరిపోయే టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా లభించింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను సైతం రాబట్టి హిట్‌గా నిలిచింది. దీంతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ వచ్చి చేరింది.

బాబీతో క్రేజీ మూవీకి సిద్ధం
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. బాబీ (Bobby) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభంలోనే భారీగా నెలకొన్నాయి.

కాన్సెప్టు పోస్టర్‌తో రివీల్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి.. చాలా రోజుల క్రితమే కాన్సెప్టు పోస్టర్‌ను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో కొన్ని ఆయుధాలను చూపించడంతో పాటు సినిమా నేపథ్యంపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే వస్తోంది. ఇక, ఈ మూవీ 1980 నాటి కథతో రాబోతున్నట్లు కూడా రివీల్ చేశారు.
షూట్ స్టార్ట్.. యాక్షన్‌తో
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే మొదలు పెట్టింది. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మొదటి షెడ్యూల్‌లో హీరో బాలయ్యపై యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. కాస్త గ్యాప్ ఇచ్చి మరికొద్ది రోజుల్లోనే మరో షెడ్యూల్‌ను కూడా మొదలుపెట్టబోతున్నారు.
బాలయ్యతో స్టార్ హీరో
నటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాను బాబీ హై రేంజ్‌లోనే ప్లాన్ చేసినట్లు ఇప్పటికే తెలిసింది. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు కూడా భాగం కాబోతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో స్టార్ హీరో, 'సీతా రామం' ఫేం దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడట.

ఇది కూడా మల్టీస్టారరే
బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడట. కాసేపే ఉన్నా ఎంతో ఇంపాక్ట్ చూపించే విధంగా ఈ రోల్ ఉంటుందని తెలిసింది. తద్వారా ఈ చిత్రం కూడా మల్టీస్టారర్‌లాగే తెరకెక్కబోతుందన్న మాట. గతంలో బాబీ 'వాల్తేరు వీరయ్య', 'వెంకీ మామ' తదితర చిత్రాలను మల్టీస్టారర్‌గానే తీసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











