Balayya కోసం ఇద్దరు కుర్ర హీరోలు రంగంలోకి... ఈసారి లెక్క మామూలుగా ఉండదు గురూ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చినా... ఈ మూవీ ఆగలేదని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారట. ఆ హీరో పాత్ర కోసం... ఇద్దరు హీరోలను సంప్రదించారట మేకర్స్. ఇద్దరిలో ఎవరు ఒప్పుకున్నారు.. ఎవరు బాలయ్య కోసం రంగంలోకి దిగనున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. అయితే ప్రస్తుతం బాలయ్య అటు సినిమాలతోనూ, ఇటు రాజకీయాలతోనూ ఫుల్ బిజిగా గడుపుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 Bhagavanth Kesari

అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత బాలయ్య రాజకీయాల్లో బిజీ అయ్యారు.. ఇక సినిమాలు చేయరు అనే వార్తలు వచ్చాయి. భగవంత్ కేసరి సైతం ఆగిపోయిందనే న్యూస్ వైరల్ గా మారింది. ఇక చిత్రబృందం దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ మూవీ అనుకున్న టైంకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది.

భగవంత్ కేసరి అక్టోబర్ 19న దసరా కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ విషయం పక్కన పెడితే... బాలయ్య ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ మూవీ ఒప్పుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 21 నుంచి సెట్స్ పైకి వెళ్లాలి కానీ... ఇప్పుడు సెప్టెంబర్ 27కి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

 Bhagavanth Kesari

ఇక ఈ చిత్రంలో కథలో కొన్ని మార్పులు చేశారు. అయితే బాలయ్య కోసం మరో హీరో కూడా ఈ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఆ పాత్ర కోసం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లేదంటే నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దుల్కర్ సల్మాన్ ను సంప్రదించారట. ఇంకా దీనిపై ఎటువంటి రెస్పాన్స్ రాలేదని టాక్.

Dulquer Salmaan or Nani will play the role of another hero in Balayya Bobby Movie News Goes Viral

మరోవైపు నానిని కూడా చిత్రబృందం సంప్రదించనుందని తెలుస్తోంది. ఇక నాని కూడా హ్యాండ్ ఇస్తే.. మరో యంగ్ హీరోను తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్నిసితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌' కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో బాలయ్యతో పాటు ఏ హీరో నటించనున్నారో చూడాలి. మొత్తానికి బాబీ బాలయ్య సినిమా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X