»   » అఖిల్ మూవీ ప్రారంభంలోనే రూమర్స్... అసలు విషయం ఇదీ!

అఖిల్ మూవీ ప్రారంభంలోనే రూమర్స్... అసలు విషయం ఇదీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అఖిల్ అక్కినేని తన 3వ సినిమా 'తొలి ప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో మొదలు పెట్టారు. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొనడంతో రూమర్స్ మొదలయ్యాయి. అఖిల్ మూవీలో దుల్కర్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

అయితే అలాంటిదేమీ లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. 'మహానటి' సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన దుల్కర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చారు. అఖిల్, దుల్కర్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. తన సినిమా ఓపెనింగుకు అఖిల్ ఆహ్వానించడంతో దుల్కర్ వచ్చినట్లు సమాచారం.

Dulquer Salmaan says dubbing in Telugu is Very hard

కాగా... దుల్కర్ సల్మాన్ 'మహానటి' చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తెలుగులో డబ్బింగ్ చెప్పడం అంటే పరీక్షలకు సిద్ధం అవ్వడం కంటే కఠినంగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం కేరళ యంగ్ యాక్టర్ మలయాళం, హిందీ, తమిళంలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆయన సోనమ్ కపూర్‌తో కలిసి 'జోయా ఫ్యాక్టర్' అనే సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ ఫిల్మ్ కార్వాన్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అతడు తమిళ సినిమా షూటింగులో ఉన్నారు.

English summary
Actor Dulquer Salmaan seems to be burning the midnight oil to finish dubbing for his debut Telugu film Mahanati. The Malayalam actor, who is well-versed in spoken Tamil and Hindi, took to Twitter to say that dubbing his lines in Telugu has been harder than preparing for his exams.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X