అల్లు అర్జున్ నిర్మాతకి పవన్ గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానయ్య మరో ప్రాజెక్టు ఓకే చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన దానయ్య ఆయనతో సినిమా చేయటానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని తెలుగులో ఓ మెగా దర్శకుడు చేపట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక దానయ్య ఇప్పటికే వివి వినాయిక్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మరో చిత్రాన్ని సైతం ప్రకటించి ఉన్నారు. ఈ చిత్రం కూడా మొదలైతే ముగ్గరు మెగా హీరోలతోనూ ఒకే సారి సినిమాలు చేస్తున్న ఘనత నిర్మాతకు దక్కుతుంది. దానయ్య గతంలో అల్లు అర్జున్ తో దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ ని, వరుడు వంటి డిజాస్టర్ ని ఇచ్చి ఉన్నారు. త్రివిక్రమ్ తో జరుగుతున్న సినిమా రొమాంటిక్ కామిడీ అని చెప్తున్నారు.
ఖలేజా అనంతరం వస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అలాగే బద్రీనాధ్ సైతం భాక్సాఫీస్ వద్ద అలరించకపోవటంతో అల్లు అర్జున్ సైతం మరో హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నారు. నిర్మాత సైతం ఈ సినిమా హిట్టైతే తన వరస ఫ్లాపులనుంచి కోలుకున్నట్లు అవుతుందని భావిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజా విడుదల తేదీ దగ్గరపడుతూండటంతో ఆ హడావిడిలో ఉన్నారు. ఆ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గబ్బర్ సింగ్ పై దృష్టిపెడతారు. ఈ రెండు ప్రాజెక్టులు తర్వాత పవన్ కొత్తగా కమిటైన చిత్రం షూటింగ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











