పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్
పవన్ కళ్యాణ్ త్వరలో ఓ మాస్ మసాలా ఫిలిం చేయనున్నారు. దర్శకుడు మరెవరో కాదు వివి వినాయిక్. సంక్రాంతి రోజున ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య ప్రకటించనున్నారని సమాచారం. అదుర్స్ రేపు(బుధవారం) రిలీజ్ అవుతోంది. అనంతరం ఈ చిత్రం మొదలవనున్నదని సమాచారం. ఇక ప్రస్తుతం దానయ్య అల్లు అర్జున్ హీరోగా వరుడు చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఒక్కడు వంటి సెన్సేషన్ హిట్ రూపొందించిన గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే వివివినాయిక్ దర్శకత్వంలో బదిరీనాధ్ అనే చిత్రాన్ని వివివినాయిక్ ప్లాన్ చేస్తున్నారు. చిన్నికృష్ణ చిరకాల విరామం తర్వాత కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్, నిర్మాణ విలువలతో గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానుంది. ఇక వివి వినాయిక్ చెప్పిన స్టోరీ లైన్ పవన్ కి నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ చిత్రం తర్వాత ఈ చిత్రం చేస్తాడా లేక ముందే చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











