డైనమిక్ జర్నలిస్ట్ మూర్తి... క్రేజీ మూవీ డెబ్యూ...
తెలుగు రాష్ట్రాల్లోనే డైనమిక్ జర్నలిస్ట్ గా పేరుగాంచిన మూర్తి, వెండితెరపైనా రఫ్పాడించేందుకు రెడీ అవుతున్నారు. ధైర్యసాహసాలకు పేరిన్నిక గన్న మూర్తి, ఎన్నో రాజకీయ కుంభకోణాలను బట్టబయలు చేశారు. సుధీర్ఘమైన కెరీర్ లో ఎలాంటి వివాదాలు, మరకలు లేని మూర్తి, స్వచ్ఛమైన పాత్రికేయుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఈ రియల్ హీరో, ఇప్పుడు రీల్ లోనూ కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వన్ నేనొక్కడినే, 100%లవ్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్లే బ్యాక్ అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. అంటే ఈ సినిమా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కంపౌండ్ నుంచి వస్తోందని చెప్పుకోవచ్చు. ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కామ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
చాలాకాలంగా జర్నలిస్ట్ మూర్తిని పరిశీలిస్తున్న దర్శకుడు హరిప్రసాద్, సినిమాలోని కీలక పాత్రను మూర్తి పర్శనాలిటీ ఆధారంగా రూపొందించుకున్నారని తెలుస్తోంది.

అయితే ఆ పాత్రకు కేవలం మూర్తి అయితేనే న్యాయం చేయగలరని భావించిన దర్శకుడు, ఆయన్ను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈమేరకు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా, మూర్తి ఎప్పటిలాగానే డైమనిక్ గా దర్శనమిస్తున్నారు.
ప్లే బ్యాక్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చిత్ర బృందం తెలిపింది. హుషారు ఫేమ్ దినేశ్ తేజ హీరోగా నటిస్తుండగా, మల్లేశం ఫేమ్ అనన్యా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. జులై లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తం అవుతోంది. మరి, వెండితెరపైనా అడుగుపెట్టబోతున్న మూర్తి, అక్కడ కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











