బూతు ని భగవంతుడుని బ్యాలెన్స్ చేయగలడా?

By Srikanya

హైదరాబాద్: సునీల్ కు ఈ మధ్య కాలంలో హిట్ అనేది లేదు. భీమవరం బుల్లోడు కష్టపడి ఓకే అనిపించారు. ఈ నేపధ్యంలో ఆయన తన దర్శకులు ఎన్నిక విధానాన్ని మార్చుకున్నట్లు కనపడుతోంది. ఓ ప్రక్కన తనికెళ్ల భరణి దర్శకత్వం వహించే 'కన్నప్ప'కి పచ్చజెండా వూపారు. ఇప్పుడు మరో చిత్రానికి అంగీకారం తెలిపారు. ఆయన త్వరలో బూతు చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా పేరు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో నటించబోతున్నారు. అటు దైవానికి సంభందించిన చిత్రం చేస్తున్నాం కాబట్టి...దాన్ని బ్యాలెన్స్ చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

'అందాల రాముడు' చిత్రంతో హీరో అవతారం ఎత్తారు సునీల్‌. 'మర్యాద రామన్న'గా అలరించారు. ఈమధ్య 'భీమవరం బుల్లోడు'లో నవ్వించారు. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. 'కొత్తజంట' తరవాత మారుతి దర్శకత్వం వహించే చిత్రమిదే. స్క్రిప్టు పనులు తుది దశకు చేరుకొన్నాయి. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

Ee Rojullo Maruthi to direct Sunil

మరో ప్రక్క తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.

ఈ చిత్రానికి 'సుందర్ అండ్ కో ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రీపొందనుంది. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

మరో ప్రక్క తఢాఖా చిత్రంలో నాగచైతన్య తో కలిసి హీరోగా చేసిన సునీల్ మరోసారి ఇలాంటి స్కీమ్ తో మన ముందుకు రాబోతున్నాడు. తమిళంలో విజయవంతమైన 'Varuthapadatha Valibar Sangam'చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సారి రాజశేఖర్ తో కలిసి సునీల్ చేయనున్నారు.ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సురేష్ కొండేటి ప్యాన్సీ రేటు పెట్టి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా ఈ చిత్రం గురించి ప్రకటన వస్తుందని చెప్తున్నారు. తమిళంలో ఏడు కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లకు పైగా మొదటి మూడు వారాల్లో కలెక్టు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X