రాజమౌళి ‘ఈగ’ రూ. 130 కోట్లు క్రాసైందా?
హైదరాబాద్: రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం భారీ విజయం సాదించిన విషయం తెలిసిందే. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. తాజాగా ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈగ చిత్రం తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు చెబుతున్నారు.
అక్టోబర్ 12న 'ఈగ' చిత్రాన్ని హిందీలో మక్కి పేరుతో విడుదల చేయబోతున్నారు. ఆమొత్తం కలిపితే ఈగ చిత్రం మొత్తం రూ. 200 కోట్ల మార్కును దాటుతుందనే చర్చ సాగుతోంది. అదే జరిగితే 'ఈగ' చిత్రం సౌతిండియాలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలుస్తుందని, రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా కూడా రూ. 180 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ గాలి లెక్కలు మాత్రమే. నిర్మాతలు స్వయంగా ప్రకటిస్తే తప్ప ఈ వార్తల్లో నిజా నిజాలు తేలే అవకాశం లేదు.
ఈగ చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు.
భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. ఈగ చిత్రం భారత్ తరుపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని అనుకున్నప్పటికీ.... రణబీర్ కపూర్, ఇలియానా నటించిన 'బర్ఫీ' చిత్రంతో పోటీ పడలేక ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కి ఎంపిక కాక పోయింది.


Click it and Unblock the Notifications











