రాజమౌళి ‘ఈగ’ వెనక ఆరెండు చిత్రాలు?
ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో 'ఈగ' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రంలో నాని హీరోగా, సుదీప్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విలన్ చేతిలో హతమైన హీరో ఈగ రూపంలోకి మారి ఎలా పగ తీర్చుకున్నాడనేది ఈ చిత్రం కాన్సెప్టు.
అయితే..ఈ చిత్రంపై తాజాగా ఓ పుకారు మొదలైంది. ఈగ మూవీ కథను... 1958లో హాలీవుడ్‌లో వచ్చిన 'The Fly' చిత్రంతో పాటు 1986లో వచ్చిన మరో మూవీ ఆధారంగా రాజమౌళి అల్లుకున్నాడని అంటున్నారు. ఆ చిత్రాల్లో ఓ సైంటిస్టు ఎగిరే ఈగను తయారు చేస్తాడని, వాటి ద్వారా తనకు నచ్చని వారిపై పగ తీర్చుకుంటాడని....ఈ కాన్సెప్టు ఆధారంగానే రాజమౌళి 'ఈగ' రూపొందిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో సినిమా విడుదలైతేగానీ చెప్పలేం.
మన తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్, కొరియన్ సినిమాల ఆధారంగా సినిమాలు చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. అయితే దానికి మనోళ్లు చెప్పే సమాధానం 'ఇన్‌స్పైర్ అయి తీశాం'అని. ఇప్పటి వరకైతే రాజమౌళి ఇలాంటి దర్శకుల కోవలోకి రాలేదు. ఈగ సినిమా విడుదలైతే రాజమౌళి ఏ కోవకు చెందినవాడో స్పష్టం అవుతుంది.


Click it and Unblock the Notifications











