'ఈగ' నిర్మాత నెక్ట్స్ చిత్రం ఖరారు..వివరాలు
గతంలో కోటి దర్శకత్వంలో సునీల్ హీరోగా నెపోలియన్ అనే చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చాయి. దిల్ రాజు తాను నిర్మిస్తానన్న ఆ చిత్రం బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుందని, సునీల్ కి ఆ మేరకు మార్కెట్ లేదని ఆగిపోయిందని అప్పట్లో వినపడింది. అయితే ఇప్పుడు రాజమౌళి స్వయంగా పూనుకుని ఈ ప్రాజెక్టు సెట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాసం ఉంది. పూర్తి వివరాలతో త్వరలో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గతంలో హిట్ చిత్రాలతో హాట్రిక్ కొట్టిన రవితేజ....ఇప్పుడు ప్లాపుల విషయంలో డబుల్ హాట్రిక్ కొట్టాడు.వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలో రవితేజ తన 'బలుపు' చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇంతకు ముందు రవితేజతో 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications












