రాజమౌళి ‘ఈగ’ విడుదల తేదీ ఖరారు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సారి ఓ విభిన్నమైన చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'ఈగ' టైటిల్‌తో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈచిత్రం విడుదలకు సిద్దం అయింది. తాజాగా 'ఈగ' యూనిట్ నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకే సారి అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ట్రై చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం, భారీ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నాని, సమంత, కన్నడ నటుడు సుధీప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల కాబోతోంది.
ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ మీడియా సంస్థ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సదరు సంస్థ ఇందుకోసం రూ. 5.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











