అల్లుఅర్జున్ కి విలన్ అతనే
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంలో విలన్ గా సుదీప్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. కన్నడ హీరో అయన సుదీప్ ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రంలో చేస్తున్నారు. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన రన్, ఫూంక్ వంటి చిత్రాలు చేసారు. అలా రాజమౌళి కళ్ళలో పడి ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలో బుక్కయ్యాడు. అలాగే ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఐద్రిత రే అనే కన్నడ అమ్మాయిని సెలెక్టు చేసినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం లవ్ ఇన్ హైదరబాద్ అనే చిన్న చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్నికవటంతో ఆమె జాక్ పాట్ కొట్టినట్లయింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సర్జరీ చేయించుకోవటానికి ఆస్ట్రైలియా లోని పెర్త్ కి మొన్న (ఆదివారం, ఆగస్టు 14, 2011)రాత్రి ప్లైయిట్ కి వెళ్లారు. అక్కడ సర్జరీ చేయించుకుని నెల రోజులు పాటు రెస్ట్ తీసుకుని ఇండియాకు తిరిగివస్తారు. ఇక ఈ ప్రయాణంతో త్రివిక్రమ్ సినిమా మరో నెలకు వాయిదా పడింది. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











