రవితేజ మూవీలో ఆ తెలుగు బ్యూటీ స్పెషల్ సాంగ్: తొలిసారి అలా సెగలు రేపేందుకు రెడీ

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో రవితేజ. తనదైన శైలి యాక్టింగ్‌తో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఫిదా చేసేలా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ అనే బిరుదును అందుకున్నాడు. ఇలా చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రవితేజ ఓ తెలుగు బ్యూటీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చాడట. ఆ వివరాలు మీకోసం!

క్రాక్ హిట్‌తో ఖిలాడీగా మారిన రవితేజ

క్రాక్ హిట్‌తో ఖిలాడీగా మారిన రవితేజ

'క్రాక్' మూవీ ఫలితంతో మాంచి ఊపు మీదున్నాడు రవితేజ. ఈ జోష్‌తోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు.

రామారావుగా మారిపోయిన మాస్ రాజ్

రామారావుగా మారిపోయిన మాస్ రాజ్

'ఖిలాడీ' పట్టాలపై ఉండగానే శరత్ మందవ అనే దర్శకుడితో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ధమాకా చూపించాలని రెడీ అయ్యాడు

ధమాకా చూపించాలని రెడీ అయ్యాడు


వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రవితేజ.. త్రినాథరావు నక్కినతో రవితేజ ఇటీవలే సినిమాను ప్రకటించాడు. దీనికి 'ధమాకా' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

డుయల్ రోల్.. అదే రేంజ్‌లో ఉండేలా

డుయల్ రోల్.. అదే రేంజ్‌లో ఉండేలా

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ధమాకా' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడని ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, ఇది అతడి ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతుందని అంటున్నారు. ఇక, ఈ సినిమా అన్ని వర్గాల వాళ్లను అలరించేలా తెరకెక్కిస్తున్నాడట త్రినాథరావు. దీంతో ఈ చిత్రంపై ఆది నుంచి అంచనాలు ఏర్పడ్డాయి.

రవితేజ మూవీలో ఈషా స్పెషల్ సాంగ్

రవితేజ మూవీలో ఈషా స్పెషల్ సాంగ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'ధమాకా' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాటకు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గ్లామరస్ స్టెప్పులు వేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ సాదాసీదా సినిమాలు చేసిన ఆమె.. ఇందులో ఏకంగా అందాల విందు చేయబోతుందని టాక్.

Recommended Video

Bigg Boss Telugu 5: తగ్గని VJ Sunny క్రేజ్, ఇంతకీ అప్పడం అన్నాడా ? || Filmibeat Telugu
రావణాసుర... టైగర్ సినిమాలు కూడా

రావణాసుర... టైగర్ సినిమాలు కూడా

రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రకటించి షాకిచ్చాడు. అందులో సుదీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' ఒకటి. దీన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. దీనితో పాటు టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రాబోయే 'టైగర్' అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X