‘రాగల 24 గంటల్లో’ బికినీ ట్రీట్.. ఇషా రెబ్బ మరింత బోల్డుగా!
Recommended Video
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోయిన్లు కనిపించడమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది ఈషా రెబ్బా.

అవకాశాలు లేక సతమతం
‘అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

'రాగల 24 గంటల్లో' అంటూ వస్తోంది
‘అరవింద సమేత.. వీరరాఘవ' తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయని భావించినా.. సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత సుమంత్ సరసన ‘సుబ్రహ్మణ్యంపురం'లో చేసినా ఇది కూడా ఆమెను గట్టెక్కించలేకపోయింది. దీని తర్వాత మాత్రం సీనియర్ దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాగల 24 గంటల్లో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అవకాశాల కోసం బికినీ ట్రీట్
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు ఈషా రెబ్బ సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ సినిమాలో ఆమె బికినీ ట్రీట్ ఇవ్బబోతుందని తెలుస్తోంది. ఆమె పరిచయ సన్నివేశంలో స్విమ్మింగ్ ఫూల్ నుంచి బికినీ వేసుకుని వచ్చేలా ప్లాన్ చేశారట దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి. ఈ సీన్ కావాలని పెట్టినట్లు కాకుండా అవసరం కోసం వాడినట్లు చూపించబోతున్నారట. దీంతో తాను గ్లామరస్ పాత్రలకు రెడీ అనే సిగ్నల్ ఇవ్వబోతుందట ఈషా.

'రాగల 24 గంటల్లో' గురించి..
‘అదిరిందయ్యా చంద్రం', ‘టాటా బిర్లా మధ్యలో లైలా', ‘యమగోల మళ్ళీ మొదలైంది', ‘బొమ్మనా బ్రదర్స్ - చందన సిస్టర్స్', ‘ఢమరుకం' వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో, శ్రీనవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో వస్తున్న చిత్రమే ‘రాగల 24 గంటల్లో'. శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











