ఏక్ నిరంజన్ తో జాకీచాన్
ప్రభాస్ ను బుజ్జిగాడుగా ఓ వైవిధ్యమైన కోణంలో చూపించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు ఆయన్ని ఏక్ నిరంజన్ గా చూపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రం థాయ్ లాండ్ లో 35 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మత మాట్లాడుతూ 'ప్రభాస్ శారీరక తెరకెక్కిస్తున్నారు. తనతో చిత్రీకరించిన పతాక సన్నివేశాలు, చిత్రానికి హైలైట్ ఒక ఎత్తు ఐతే కొంత మంది ఫైటర్స్ చేసిన దృశ్యాలు తెలుగు సినిమాల్లో ఇంతవరకూ చూడని విధంగా ఉంటాయి.
స్టంట్ కొరియోగ్రఫీలో సరికొత్త ట్రెండ్ తెలుగునాట స్పష్టంగా కన్పిస్తోంది. వీలైనంత వరకు టెక్నికల్ వాల్యూస్ ని వినియోగించుకోవడంతోపాటు, వివిధ రకాల యుద్ధ విద్యలు టాలీవుడ్ లోకి ఎంటరవుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఏక్ నిరంజన్" సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా వెరైటీగా కంపోజ్ చేశారట. ఇందుకోసం హాలీవుడ్ హీరో జాకీచాన్ కి పర్సనల్ గా స్టంట్ కొరియోగ్రఫీ చేసే వ్యక్తిని తీసుకొచ్చారట టాలీవుడ్ కి, పలు హాలీవుడ్ సినిమాలకీ స్టంట్ కొరియోగ్రఫీ అందించిన ఈ ఫైటర్, తెలుగులో తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని ఇన్ సైడ్ సోర్సెస్ కథనం.
ప్రభాస్ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా 'ఏక్ నిరంజన్ ఫైట్స్ వుంటాయనీ, టాలీవుడ్ చరిత్రలో ఏక్ నిరంజన్"లోని యాక్షన్ ఎపిసోడ్స్ నిలిచిపోతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఏక్ నిరంజన్" లో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ కంగనా రనౌత్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











