'ఏక్ నిరంజన్'కి అంత డెఫిషిట్ నిజమా?
పూరీ జగన్నాధ్,ప్రబాస్ కాంబినేషన్ లో గురువారం రిలీజైన ఏక్ నిరంజన్ చిత్రం పూర్తి స్దాయి డెఫిషిట్ లో రిలీజ్ అయిందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి పదికోట్లు దాకా దీనికి డెపిషిట్ ఉందని ఈ మధ్య కాలంలో ఇంత భారీ డెఫిషిట్ తో రిలీజైన చిత్రం ఇదేనంటున్నారు. ప్రబాస్ చిత్రాలు, పూరీ చిత్రాలు వరస పరాజయం పాలవటంతో ఈ చిత్రానికి చెప్పిన రేటుకు కొనేందుకు ముందుకు వచ్చిన వారు లేకపోవటంతో ఈ సమస్య ఏర్పడిందంటున్నారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ దాదాపు ఇరవై ఐదు దాకా అయిందని, అందులో చాలా భాగం పూరీకి, ప్రభాస్, కంగనాలకి రెమ్యునేషన్స్ నిమిత్తం పోగా మిగతాది టాప్ టెక్నిషయన్స్ అందుకున్నారని, హిట్ టాక్ వస్తే ఇవన్నీ అసలు కనిపించేవి కావని, ఫ్లాఫ్ టాక్ రావటంతో అన్నీ బూతద్దంలో కనిపిస్తాయని అంటున్నారు. ఇక ఇదే నిజమైతే మాత్రం చాలా నష్టం క్రిందే లెక్క. ఆదిత్యారామ్ వరస పది సినిమాలు తీస్తానన్నారు. దీని ఇంపాక్ట్ వాటిపై పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











