ప్రభాస్..ఏక్ నిరంజన్ చిత్రానికి మరో తలనొప్పి
ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్లో పూరీ జగన్నాధ్ రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అంతేకాక ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం కూడా సమస్యగా మారిందని సమాచారం. మొదట్లో ఈ చిత్రం రైట్స్ కోసం ఎంక్వైరీలు జరిగినా రిలీజ్ తర్వాత మంచి రేట్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఎవరికీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే సినిమా నెగిటివ్ రిపోర్టు రావటంతో ఇప్పుడు రైట్స్ అమ్మదామన్నా ఎవరూ ముందుకు రావటం లేదని అంటున్నారు. అంతేగాక నిర్మాత ఈ చిత్రం రైట్స్ ని చాలా ఎక్కువ రేటు చెప్పటం కూడా మరో మైనస్ అని చెప్పతున్నారు. వీటికితోడు హీరోయిన్ కంగనారౌనత్ కూడా శాటిలైట్ రేటు రాకపోవటానికి మరో కారణం. అదే అనుష్క,త్రిష,ఇలియనా వంటి వారికి ప్లాఫ్ సినిమా అయినా మంచి మార్కెట్ పలుకుతుందని చెప్తున్నారు.
ఏక్ నిరంజన్ పూరీ జగన్నాధ్ శాటిలైట్ రైట్స్ కంగనా రనౌత్ త్రిష అనుష్క ఇలియానా ఆదిత్యారామ్ ప్రభాస్ prabhas puri jagannath satillite trisha kangana ranaut anushka ileana aditiya ram


Click it and Unblock the Notifications