ఏకవీర ఫ్లాఫ్, రవితేజ ప్రాజెక్టుపై ఎఫెక్టు?
రీసెంట్ గా మొన్న శుక్రవారం విడుదలైన ఏకవీర చిత్రం దర్సకుడు వంసత్ బాలన్ తెలుగులో సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ మేరకు గత నెల రోజులుగా చర్చలు జరుగుతున్నట్లు జరుగున్నాయి. తెలుగులో రవితేజని కలిసి కథ వినిపించాడని వెంటనే ఓకే చేసాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఏక వీర చిత్రం పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో ఆ ఎఫెక్టు ఈ ప్రాజెక్టు మీద ఏ మేరకు పడుతుందా అని ఆలోచిస్తున్నారు. మరో ప్రక్క రవితేజ సైతం నిప్పు వంటి డిజాస్టర్ తో సతమతమవుతున్నారు.
ఈ మధ్యన వరసగా రవితేజ సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతన్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాని నిర్మిద్దామనుకున్న ఓ భారీ నిర్మాత పునరాలోచనలో పడుతున్నట్లు చెప్తున్నారు. అయితే రవితేజ మాత్రం సినిమా ఫ్లాప్ కీ దానికి సంభందం లేదని చెప్పినట్లు వినికిడి. ఇక అన్ని సెటిల్ అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాసం ఉంది. ప్రస్తుతం రవితేజ ..దరువు చిత్రం చేస్తున్నారు. శౌర్యం శివ దర్శకత్వంలో ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











