For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మకు ఆమె XES అందిట

    By Srikanya
    |

    ముంబై: రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య XES అనే చిత్రం ప్రారంభిస్తానంటూ ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజం రూపం దాల్చనుంది. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి మధ్యా ఎగ్రిమెంట్ కుదిరినట్లు సమాచరం. వర్మ సైతం ఈ చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తాననే పూర్తి నమ్మకంగా ఉన్నారు.

    ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ......శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేదు. 'XES' చిత్రం ద్వారా తన కెరీర్లో ఉన్న ఆ వెలితిని పూడ్చ బోతున్నారు వర్మ. కెరీర్లో తొలిసారి సెక్స్ ప్రధానమైన సినిమా చేస్తుండటంపై రామ్ గోపాల్ వర్మ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.

     Ekata Kapoor produces RGV's XES

    'కెరీర్ మొదటలు పెట్టిన తర్వాత అన్ని రకాల సినిమాలు తీసాను. శివ (స్టూడెంట్ పాలిటిక్స్), రంగీలా (లవ్ స్టోరీ), భూత్ (హారర్), సత్య (గ్యాంగ్ స్టర్), దౌడ్ (కాపర్), సర్కార్ (డ్రామా), కౌన్ (సైకలాజికల్ థ్రిల్లర్), అటాక్స్ ఆఫ్ 26/11 (టెర్రరిజం) ఇలా చాలా రకాలు చేసాను. కానీ ఇప్పటి వరకు శృంగార ప్రధానమైన సినిమా మాత్రం చేయలేదు. ఇపుడు చేయాలనుకుంటున్నాను. 'XES' టైటిల్‌తో ఈ సినిమా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

    సాధారణ సెక్స్ చిత్రాల్లా కాకుండా ఈచిత్రాన్ని డిఫరెంటుగా, తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. సెక్స్ గురించి మనిషి ఆలోచనల్లోని ఆరు డిఫరెంటు సిచ్యువేషన్స్ ....ఒకే స్టోరీలో చూపించబోతున్నారు. సెక్స్‌కు సంబంధమైన అంశాల్లో..... నేరము, ద్రోహం, హెల్ప్‌లెస్‌నెస్, ఎంబరాస్మెంట్, హర్ట్, ఇవన్నీ కలిపి ఒక యాంగిల్ చూపించబోతున్నామని వర్మ చెప్పుకొచచ్చారు. మరి వర్మ శృంగార ప్రియులను ఏమేరకు మెుప్పిస్తారో చూడాలి.

    English summary
    RGV is getting ready to show his erotic angle on silver screen with his upcoming Hindi film ‘XES’. According to the latest Ekta Kapoor will be producing the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X