Ekka Box Office Collections: ఎక్కా మూవీకి షాకింగ్ వసూళ్లు.. యువ రాజ్‌కుమార్ సినిమా ఎన్ని కోట్లంటే?
కన్నడ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ఎక్కా. సంజనా ఆనంద్, సంపద హీరోయిన్లుగా నటించారు. రోహిత్ పడకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్ శెట్టి, శృతి, సాధు కోకిల, పూర్ణ చంద్ర మైసూర్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగీ జీ రాజ్ నిర్మించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి, దీపు ఎస్ కుమార్ ఎఢిటర్‌గా వ్యవహరించారు. జూలై 18వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఇక ఎక్కా సినిమాను మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు కమర్షియల్ హంగులతో భారీగా తెరకెక్కించారు. సెట్స్, క్రేజీ లొకేషన్లలో షూట్ చేశారు. కథ డిమాండ్ మేరకు క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అంతేకాకుండా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 20 కోట్ల షేర్.. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
గత కొద్దికాలంగా కన్నడ సినిమా పరిశ్రమ భారీ సినిమాలు రిలీజ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో కర్ణాటక వ్యాప్తంగా రిలీజైన ఎక్కా చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. రాజ్ కుమార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో సందడిని ఈ సినిమా తీసుకొచ్చిందనే కామెంట్ చేస్తున్నారు. నిస్తేజంగా ఉన్న సాండల్ ఉడ్‌కు ఎక్కా సినిమా కొత్త జోష్‌ను తెచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడయాల కనిపిస్తున్నాయి. జూనియర్ సినిమాతో పోటీ పడుతూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల రేసులో ముందున్నదనే టాక్ వినిపిస్తున్నది.
ఎక్కా సినిమా కేవలం కర్ణాటకలోనే ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లో రిలీజ్ అయినప్పటికీ.. కన్నడ వెర్షన్‌లోనే ప్రదర్శించడం వల్ల పెద్దగా ప్రేక్షకులు ఆసక్తి చూపలేదనే మాట వినిపించింది. కర్ణాటకలో ఈ సినిమాకు ఉదయం ఆటలకు 40 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలకు 50 శాతం, రాత్రి ఆటలకు సుమారుగా 55 నుంచి 65 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. బెంగళూరు, హుబ్లీ 50 శాతం వరకు, మైసూర్, శివమొగ, తూమ్కూరు, రాయ్‌చూర్ ప్రాంతంలో 70 శాతానికిపైగా అత్యధికంగా ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక కర్ణాటకలో ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తుండటంతో యువ రాజ్ కుమార్ కెరీర్‌లో భారీ ఓపెన్సింగ్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా 2 కోట్ల రూపాయల నెట్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాక్ ఇంకాస్త పాజిటివ్‌గా మారితే సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగి ఇంకాస్త వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కన్నడలో చాలా రోజుల తర్వాత స్టార్ వాల్యూ ఉన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వన్ సైడ్ పాజిటివ్ రావడంతో కలెక్షన్లు కూడా ఎక్కువగానే వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తున్నది. ఈ సినిమా జోష్ ఇలానే కొనసాగిస్తే.. తొలివారంలో 40 గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్‌ను రీచ్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











