నితిన్ ఏంటి దెయ్యం పిల్ల వెంట పడుతున్నాడు
Recommended Video

చార్మింగ్ హీరో నితిన్ జోరు మీద ఉన్నాడు. లై చిత్రం నిరాశ మిగిల్చినా నితిన్ చిత్రాల వేగం మాత్రం తగ్గడం లేదు. ఆయన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాణంలో నితిన్ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

దిల్ రాజుతో 15 ఏళ్ల తరువాత నితిన్
2003 లో దిల్ రాజు నిర్మాణంలో వివి వినాయక్ దర్శకుడిగా తెరకెక్కిన నితిన్ చిత్రం దిల్ అప్పటి యువతని ఉర్రూతలూగించింది. దాదాపు 15 ఏళ్ల తరువాత మళ్ళీ నితిన్ దిల్ రాజు నిర్మాణంలో నటించనుండడం విశేషం. శతమానం భవతి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు.

నితిన్ సరసన దెయ్యం భామ
ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా నందిత శ్వేతని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ద్వారా నందిత శ్వేతా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ చిత్రంలో నందిత శ్వేతా దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది. నందిత నటనకు మంచి మార్కులే పడ్డాయి.

పలకరించని అవకాశాలు
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం విజయం సాధించినా నందితకు అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు నితిన్ చిత్రం కోసం దర్శకుడు సతీష్ ఆమెని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

టైటిల్ అదే, త్వరలోనే సెట్స్ పైకి
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి శ్రీనివాస కళ్యాణం అనే పేరు పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనేది దర్శక నిర్మాతల ప్లాన్.


Click it and Unblock the Notifications











