‘డర్టీ పిక్చర్’స్మిత స్టోరీ కాదు..ప్లేట్ ఫిరాయించిన ఏక్తా...?
సిల్క్ స్మిత జీవితంపై విద్యాబాలన్ హీరోయిన్ గా లూథ్రియా దర్శకత్వంలో ఏక్తా కపూర్ 'ది డర్టీ పిక్చర్" అనే హిందీ చిత్రాన్ని నిర్మిస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర పో్స్టర్స్, ట్రైలర్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇటు ప్రేక్షకులతో పాటు... అటు సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రోజురోజుకూ అంచనాల్ని పెంచుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. ఈ చిత్ర దర్శక నిర్మాతలకు సిల్క్ స్మిత సోదరుడు వి నాగవర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించిన విషయం విధితమే..
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్ లో నిర్మించిన చిత్రం 'ది డర్టీ పిక్చర్'.ఈ సినిమాలో విద్యా బాలన్ ని చాలా హాట్ హాట్ గా చూపించారని ట్రైలర్స్ చూస్తే ఎవరికైనా ఈజీగా అర్ధం అవుతుంది. సిల్క్ స్మిత జీవితం గురుంచి తెలుసుకోవడానికి విద్యా స్వయంగా సిల్క్ స్మిత స్వంత ప్రదేశాన్నికూడా సందర్శించివచ్చింది. విద్యాబాలన్ చేత దారుణంగా ఎక్స్ పోజింగ్ చేయింది, దానినే పబ్లిసిటీకి వాడుకుంటోన్న ఈ చిత్రం ఇప్పుడు లీగ్ సమస్యల్లో పడింది.
సిల్క్ స్మిత సోదరుడు నాగ వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిషేధించాలని కోర్ట్ కి వెళ్ళడంతో ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు మాట మార్చింది. సి ల్క్ స్మిత జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించామేగాని స్మిత జీవిత చరిత్ర కాదని ఇందులో ఎవర్నీ కించపరిచే సన్నివేశాలు లేవని, ఈ చిత్రం 1980లలోకష్టాలు పడిన తారల గురించి ఈ చిత్రాన్ని తీస్తున్నామంటూ వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు స్మిత జీవిత చరిత్ర అని చెప్పిన ఏక్తాకపూర్, ఇప్పుడు ఇలా ఆమె గురించిన సినిమా కాదంటూ, కొంతమంది తారల గురించి అని ప్లేటు ఫిరాయిండం చాలా మందిని ఆశ్చర్యపరిచింది...ఈ విషయం కోర్ట్ లో ఉన్నందున తీర్పు వస్తే గానీ సినిమా పరిస్థితి తెలీదు.


Click it and Unblock the Notifications











