The Dirty Picture 2: సిల్క్ స్మితా జీవితంలో మరో కోణం.. విద్యా బాలన్ రిజెక్ట్.. మరో హీరోయిన్ ఫిక్స్?

సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ది డర్టీ పిక్చర్ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాపై ఎన్నో రకాల వివాదాలు క్రియేట్ అయిన కూడా నిర్మాత ఏక్తా కపూర్ భారీ స్థాయిలోనే ఆ సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. ఇక అనుకున్నట్లుగానే సినిమాను 2011లో విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ కూడా అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏక్తాకపూర్ ఆ సినిమాకు సీక్వెల్ ను కూడా తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అప్పట్లోనే ఈ సినిమా సెకండ్ పార్ట్ ను కూడా చాలా తొందరగానే విడుదల చేయబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వివిధ కారణాల వలన అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ధైర్యం చేయలేకపోయారు అని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తానికి ఏక్తా కపూర్ మళ్లీ ది డర్టీ పిక్చర్ కు సీక్వెల్ ను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Ekta kapoor planing on The Dirty Picture 2 and consider Kangana Ranaut name

అయితే సిల్క్ స్మిత జీవితంలో మరేదైనా కొత్తకోనాన్ని చూపిస్తారా లేదంటే మరొకరి జీవితాన్ని తెరపైకి తీసుకువస్తారా అనేది చూడాలి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు సీక్వెల్ పై ఆలోచించినప్పుడు మరోసారి విద్యా బాలన్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఆ పాయింట్ మాత్రం ఆమెకు ఏమాత్రం నచ్చలేదట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రౌనత్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఈ ప్రాజెక్టులో నటించడానికి కొంతమంది గ్లామరస్ హీరోయిన్స్ కూడా ఆసక్తిని చూపించారట. కానీ కంగనా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏక్తా కపూర్ కి మరొకరి అవసరం పడలేదు అని తెలుస్తోంది. ఏదేమైనా కూడా సంచలనాత్మకమైన సినిమాకు ఏక్తాకపూర్ మరోసారి ప్రణాళికలు రచించినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X