సెక్స్ సినిమా: వర్మపై లేడీ నిర్మాత గుర్రుగా ఉందట?

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య XES అనే చిత్రం ప్రారంభిస్తానంటూ ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాలీవుడ్ యంగ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్ ఓకే చెప్పారు కూడా. ఈ మధ్య కాలంలో ఆమె నిర్మించిన సినిమాల్లో సెక్స్ సీన్ల మోతాదు కాస్త ఎక్కువే ఉంది. మసాలా సీన్లతో పబ్లిసిటీ పెంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో ఆమె సక్సెస్ అవుతూ లాభాలు గడిస్తోంది.

వర్మ సినిమా కూడా అదే కోవకు చెందినది కాబట్టి ఆమె వెంటనే ఓకే చెప్పింది. అయితే చెప్పిన సమయానికి వర్మ స్క్రిప్టు రెడీ చేయక పోవడంపై ఏక్తా కపూర్ కోపంగా ఉందట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయని....వర్మ ‘XES' నుండి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Ekta Kapoor and Ram Gopal Varma's XES film goes bust

ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ......శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేదు. 'XES' చిత్రం ద్వారా తన కెరీర్లో ఉన్న ఆ వెలితిని పూడ్చ బోతున్నారు వర్మ. కెరీర్లో తొలిసారి సెక్స్ ప్రధానమైన సినిమా చేస్తుండటంపై రామ్ గోపాల్ వర్మ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.

'కెరీర్ మొదటలు పెట్టిన తర్వాత అన్ని రకాల సినిమాలు తీసాను. శివ (స్టూడెంట్ పాలిటిక్స్), రంగీలా (లవ్ స్టోరీ), భూత్ (హారర్), సత్య (గ్యాంగ్ స్టర్), దౌడ్ (కాపర్), సర్కార్ (డ్రామా), కౌన్ (సైకలాజికల్ థ్రిల్లర్), అటాక్స్ ఆఫ్ 26/11 (టెర్రరిజం) ఇలా చాలా రకాలు చేసాను. కానీ ఇప్పటి వరకు శృంగార ప్రధానమైన సినిమా మాత్రం చేయలేదు. ఇపుడు చేయాలనుకుంటున్నాను. 'XES' టైటిల్‌తో ఈ సినిమా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య ఓ ప్రకటనలో తెలిపారు తెలిపారు.

సాధారణ సెక్స్ చిత్రాల్లా కాకుండా ఈచిత్రాన్ని డిఫరెంటుగా, తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. సెక్స్ గురించి మనిషి ఆలోచనల్లోని ఆరు డిఫరెంటు సిచ్యువేషన్స్ ....ఒకే స్టోరీలో చూపించబోతున్నారు. సెక్స్‌కు సంబంధమైన అంశాల్లో..... నేరము, ద్రోహం, హెల్ప్‌లెస్‌నెస్, ఎంబరాస్మెంట్, హర్ట్, ఇవన్నీ కలిపి ఒక యాంగిల్ చూపించబోతున్నామని వర్మ చెప్పుకొచచ్చారు. మరి వర్మ శృంగార ప్రియులను ఏమేరకు మెుప్పిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X