రాజమౌళి అడిగినా ఆమె నో చెప్పేసిందట.. ‘RRR’కే ఎందుకిలా జరుగుతోంది.?

Recommended Video

Huge Disappointment For Rajamouli, Popular Actress Rejects Rajamouli's Offer || Filmibeat Telugu

దర్శకధీరుడు రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో పాటు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి.

మొదటి నుంచీ అవాంతరాలే

మొదటి నుంచీ అవాంతరాలే

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఇందులో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, రాజమౌళి తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం వంటి వాటితో షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. అలాగే, మిగిలిన నటుల డేట్స్ సర్ధుబాటు కాకపోవడం వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.

తారక్ హీరోయిన్ విషయంలో..

తారక్ హీరోయిన్ విషయంలో..

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా నటించే హీరోయిన్ గురించి క్లారిటీ రావడం లేదు. మొదట తారక్‌కు జోడీగా హాలివుడ్ అమ్మాయి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, ఆమె సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

తర్వాత ఎంతో మంది పేర్లు

తర్వాత ఎంతో మంది పేర్లు

ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో అతడికి జంటగా నిత్యామీనన్ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ‘వైల్డ్ లైఫ్', ‘నెర్వ్', ‘వలంటైన్స్ డే', ‘అడల్ట్ వరల్డ్' సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెతో రాజమౌళి సంప్రదింపులు జరిపారని వార్తలు కూడా వచ్చాయి.

ఒప్పుకోలేదట

ఒప్పుకోలేదట

ఎమ్మా రాబర్ట్స్.. తారక్ సరసన నటిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, తాజాగా దీనికి సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో చేయడానికి ఎమ్మా రాబర్ట్స్ ఒప్పుకోలేదనేదే దాని సారాంశం. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

కారణాలివేనంటున్నారు

కారణాలివేనంటున్నారు

ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందట. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేకే ఎమ్మా రాబర్ట్స్‌ తప్పుకున్నట్లు సమాచారం. దీని కోసం పెద్ద మొత్తం ఆఫర్ చేసినప్పటికీ తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవడం కుదరలేదని ఆమె చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తారక్ జోడీ రేసు నుంచి ఎమ్మా తప్పుకున్నట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X