OG Movie: పవన్ మూవీ నుంచి క్రేజీ లీక్.. పవర్ స్టార్‌తో సమానంగా ఆ హీరో రోల్

చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. ఇలా ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

క్రేజీ యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమానే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ముంబై నేపథ్యంతో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుంది. అంతేకాదు, వరుసగా అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే గ్లింప్స్‌ను వదిలారు. ఇది సంచలనమే సృష్టించింది.

Emraan Hashmi and Pawan Kalyan Scenes Highlight in OG Movie

'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటి వరకూ 60 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు పవన్ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్‌కు విరామం తీసుకున్నారు.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన షెడ్యూల్‌లో ఆయన కూడా పాల్గొన్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఇమ్రాన్ - పవన్ కల్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా ఉంటాయట. వీళ్లిద్దరి ఎపిసోడ్స్ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

Emraan Hashmi and Pawan Kalyan Scenes Highlight in OG Movie

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X