సెక్స్ చిత్రాల తారతో నో చెప్పిన ఇమ్రాన్?
సన్నీ లియోన్. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఫోర్న్ సినిమాల్లో(బూతు సెక్స్ సినిమాలు) నటించే తార. తమ టీఆర్పీ రేటింగులు పెంచడానికి బిగ్ బాస్ రియాల్టీ షోలోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. ఒక ఫోర్న్ స్టార్ భారత్ లో అడగు పెట్టడం, అందులోనూ పాపులర్ రియాల్టీషోలో దర్శనం ఇవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఎక్కడ చూసినా ఈవిడ గురించే చర్చ. ఇదే అదునుగా సొమ్ము చేసుకోవాలని భావిచించిన బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ జిస్మ్-2 చిత్రంలో ఆమెను ఇమ్రాన్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు కూడా.
అయితే తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ సన్నీ లియోన్ లాంటి ఫోర్న్ స్టార్ తో నటించడానికి నో చెప్పాడట. ఇప్పటికే ...సిరియల్ కిస్సర్ అని తనపై పడ్డ ముద్రను జీర్ణించుకోలేక పోతున్న ఇమ్రాన్, ఈ సినిమాలో ఆమెతో కలిసి నటిస్తే తనను కూడా అంతా ఫోర్న్ హీరో అని పిలవడం ఖాయం అని భయ పడుతున్నాడు. అందుకే ఆ ప్రాజెక్టు వదులుకోవడానికైనా సిద్దమే కానీ, ఆమెతో నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇమ్రాన్ నటించిన డర్టీ పిక్చర్ సూపర్ హిట్టయింది. ఇందులో ఇమ్రాన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో షాంఘై, రాజ్ 3డి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇమ్రాన్.


Click it and Unblock the Notifications











