Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డార్లింగ్ తో లవ్ ఎఫైయిర్ కి ప్రభాస్ ఫుల్ స్టాప్...?
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అందరికి 'డార్లింగ్" అనే విషయం తెలిసిందే. అయితే ఈ డార్లింగ్ కాజల్ ను తన డార్లింగ్ గా భావిస్తున్నాడని, వీరి ప్రేమ ముదిరి పాకన పడినట్లుగా గతకొద్ది కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటికి కాజల్ స్పందిస్తూ..మా మధ్య అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది. అయితే ఇవన్నీ పై పైన మాటలేనంటూ మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. దాంతో కాజల్ తన విశ్వరూపం చూపించాల్సి వచ్చింది.
విశ్వరూపం అంటే వెళ్లి గొడవ పెట్టుకోవడం కాదండి. ప్రభాస్ ప్రేమికురాలు అంటే ఎంత పద్దతిగా ఉండాలో అభిమానుల్లో ఓ ముద్ర ఉంది. ఇప్పటి వరకు ఆ ముద్రలో కాజల్ సరిగ్గా సరిపోయేది. అయితే ఈ విధంగా కాజల్, ప్రభాస్ ల మధ్య వస్తున్న వార్తలు భరించలేక..కాజల్ అందాల ప్రదర్శనతో ఎదుర్కొవాలని నిర్ణయించుకుంది. అంతే ఇటీవలే వచ్చిన ఓ మ్యాగజైన్ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, అర్థనగ్న ఫోటోలతో దర్శనమిచ్చేసిన విషయం విధితమే..
ఈ ఫోటోలను చూసిన అభిమానులు..మా అభిమాన నటుడికి కాబోయే భార్య ఇలా బరి తెగింగి బట్టలు విప్పేసి, అర్థనగ్నంగా కనిపించదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ కు కాబోయే భార్య కాజల్ మాత్రం కాదని అభిమానులు ప్రభాస్-కాజల్ మధ్య వచ్చిన పుకార్లకు శుభం కార్డు వేసేశారు..అదేవిధంగా ప్రభాస్ ఇంట్లో ఇంతకాలం, కాజల్ పై కాస్తో కూస్తో మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఫోటో ఆ అభిప్రాయంకూడా పోగొట్టుకుందని సమాచారం. కాబట్టి ఏరకంగా చూసిన కూడా ప్రస్తుతం ప్రభాస్ కాజల్ ల మధ్య ఎలాంటి ఎఫైర్ లు నడవటం లేదని తేలిపోయింది.