నందమూరి అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. రెండు తరాల హీరోలను ఒక్కచోట చేర్చి!

నందమూరి అభిమానులు ఖుషీ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది 'ఎంత మంచి వాడవురా' చిత్రయూనిట్. రెండు తరాల నందమూరి వారసులను ఓకే వేదికపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారట యూనిట్ సభ్యులు. ఈ వార్త నందమూరి అభిమాన వర్గాల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఆ వివరాలు చూద్దామా..

కళ్యాణ్ రామ్ హీరోగా 'ఎంత మంచివాడవురా!'

కళ్యాణ్ రామ్ హీరోగా 'ఎంత మంచివాడవురా!'

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా!' మూవీ తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 17వ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం బాణీలు కట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్, వీడియోస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

బాబాయ్, అబ్బాయిలను ఒక్కచోట చేర్చి..

బాబాయ్, అబ్బాయిలను ఒక్కచోట చేర్చి..

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయాలని ఫిక్స్ అయింది చిత్రయూనిట్. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు 'ఎంత మంచివాడవురా!' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు బాబాయ్, అబ్బాయిలను ఒక్కచోట చేర్చి నందమూరి అభిమానులకు కిక్కివ్వాలని భావిస్తున్నారట.

కళ్యాణ్ రామ్ కోసం బాలయ్య, ఎన్టీఆర్

కళ్యాణ్ రామ్ కోసం బాలయ్య, ఎన్టీఆర్

'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్ 2020 జనవరి 8న జరుగనుందని తెలిసింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ లని ఆహ్వానించిందట చిత్రయూనిట్. కళ్యాణ్ రామ్ సినిమాకు తమ వంతు సహకారం అందించేందుకు ఆ ఇద్దరూ వస్తామని మాటిచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ సమాచారం రానుందని టాక్.

 ఎప్పటిలాగే ఇప్పుడు కూడా

ఎప్పటిలాగే ఇప్పుడు కూడా

గతంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్‌కు బాలయ్య హాజరయ్యాడు. అదేవిధంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అలాగే '118' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, బాలయ్య సందడి చేశారు. ఈ బాటలోనే మరోసారి 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారట నందమూరి వారసులు.

 నందమూరి వారసుల సహకారం.. అభిమానుల్లో ఉత్సాహం

నందమూరి వారసుల సహకారం.. అభిమానుల్లో ఉత్సాహం

ఇలా నందమూరి హీరోలు ఒకరి సినిమాకు మరొకరు సహకారం అందించుకోవడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. నందమూరి హీరోలను ఒకే వేదికపై చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X