»   » షాకింగ్: బాహుబలి స్టోరీ మొత్తం ఆన్‌లైన్లో లీకైంది? (ఫోటో ఫీచర్)

షాకింగ్: బాహుబలి స్టోరీ మొత్తం ఆన్‌లైన్లో లీకైంది? (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే....ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఆన్ లైన్లో లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్టోరీ నిజమైందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

లీకైన స్టోరీ ఇలా ఉంది...
‘మహిష్మతి రాజ్యానికి అధిపతి అమరేంద్ర బాహుబలి(ప్రభాస్). ఆయన భార్య దేవసేన(అనుష్క). వీరి పాలనలో ప్రజలు సుఖ శాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు. అయితే స్వార్థపరుడైన మంత్రి బిజ్జల దేవ(నాజర్)...బాహుబలి సోదరుడు, క్రూరుడైన భల్లలదేవ(రానా)తో చేతులు కలిపి రాజును యుద్ధంలో చంపి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.


రాజ్యం తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత భల్లలదేవ ...... రాజ్యంలో తన భారీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. ప్రజలను తన బానిసలుగా చూస్తాడు. పసివాడైన బాహుబలి కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లలదేవ. అయితే దేవసేన(అనుష్క) తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అయితే భల్లలదేవ సైన్యం దేవసేనను బంధించి చరసాల పాలు చేస్తారు.


బేబీ బాహుబలిని కొందరు గ్రామస్తులు కాపాడుతారు. పెంచి పెద్దచేస్తారు. అతనికి శివుడు అని పేరు పెడతారు. శివుడు కూడా తండ్రి పోలికలతోనే ఉంటాడు. ఓసారి తను ఉండే ప్రాంతానికి అవంతిక వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు శివుడు. ఆమెను వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యానికి వెళాతాడు. తన గతం గురించి తెలుసుకుంటాడు. క్రూరుడైన భల్లలదేవ పై ప్రతీకారం తీర్చుకుని రాజ్యాన్ని, ప్రజలను తన తల్లిని ఎలా కాపాండుకుంటాడనేది స్టోరీ లైనప్. తన తండ్రి రాజ్యాన్ని సొంతం చేసుకునే క్రమంలో శివుడు, భల్లలదేవ మధ్య భారీ యుద్ధం ఉంటుందని, అయితే ఈ యుద్దం సెకండ్ పార్ట్ లో ఉంటుందని.... బాహుబలి తొలి భాగం మొత్తం శివుడు గురించి, అతను తన గతాన్ని ఎలా తెలుసుకుంటాడనే స్టోరీలైన్ మీదనే ఉంటుందని అంటున్నారు.


రానా

రానా

బాహుబలి సినిమాలో భల్లలదేవ ఓల్డ్ అండ్ యంగ్ గెటప్.


శివుడు

శివుడు

అవంతిక కోసం వెతుకుతూ వెళ్లిన శివుడు తన గతం గురించి తెలుసుకుంటాడు.


తమన్నా

తమన్నా

తమన్నా అవంతిక పాత్రలో కనిపించబోతోంది.


బాహుబలి

బాహుబలి

అమరేంద్ర బాహుబలి పాతరలో ప్రభాస్ లుక్ సూపర్బ్.


మహిష్మతి రాజ్యం

మహిష్మతి రాజ్యం

మహిష్మతి రాజ్యాన్ని గ్రాఫిక్స్ ద్వారా సృష్టించారు.


అనుష్క

అనుష్క

శివుడి తల్లి, మహారాణి దేవసన పాత్రలో అనుష్క నటించింది.


గ్రేట్ వార్

గ్రేట్ వార్

బాహుబలి, భల్లలదేవ మధ్య భారీ యుద్ధం జరుగుతుంది.


English summary
It is shocking to know that Baahubali story is being circulated online. Though we are not sure how far the story is true, we would want to remind you that the leaked stories we have reported earlier for Temper, Son Of Satyamurthy and many more have come out to be true.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu