మహేష్ వల్ల నష్టం, పవన్‌ కళ్యాణ్‌ పూడుస్తాడా?

By Bojja Kumar

Eros International eye on 'Gabbar Singh 2'
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన '1-నేనొక్కడినే' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం పరాజయం పాలవ్వడంతో నష్టాలే మిగిలాయి. తాజాగా ఈ సంస్థ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే 'గబ్బర్ సింగ్ -2' చిత్రానికి సహ నిర్మాతగా వ్యహరించనుందని తెలుస్తోంది. మహేష్ బాబుతో వచ్చిన నష్టం పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా పూడ్చుకోవచ్చనే ప్లాన్లో ఉన్నారట.

గబ్బర్ సింగ్-2 చిత్రం రద్దయిదంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నమ్మొద్దని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అంటున్నారు. ఆగస్టు చివరి వారంలో ఈ చిత్రం మొదలు కావాల్సి ఉండగా....స్క్రిప్టులో మార్పుల వల్ల లేటవుతోందని, పవన్ కళ్యాణ్ పర్సనల్‌గా స్క్రిప్టు విషయంలో కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈచిత్రం గత కొన్ని రోజుల క్రితమే లాంచనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే 'గబ్బర్ సింగ్ 2' షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొన బోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు ప్రొడక్షన్ టీం సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చకచకా పూర్తి చేసుకుంటూ వెలుతోంది. 'గబ్బర్ సింగ్' చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో 'గబ్బర్ సింగ్ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి రచన పర్యవేక్షణ సీనియర్ రచయిత సత్యానంద్, క్రియేటివ్ హెడ్ : హరీష్ పాయ్, రచన సహకారం శ్రీధర్ సీపని, కిషోర్ గోపు, ఛాయాగ్రహణం : జయనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ : గౌతమ్ రాజు, ఆర్ట్ డైరక్టర్ : ఆనంద్ సాయి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : రాజేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : సి భాస్కర రాజు, నిర్మాత : శరత్ మరార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X