అప్పుడు మహేష్ కు ఇప్పుడు పవన్ కి ఫైనాన్స్
హైదరాబాద్ : పెద్ద హీరోల చిత్రాలకు ఫైనాన్స్ చేస్తే రికవరీలు చేసుకోవటం ఈజీ. దాంతో వాటిపై పెట్టుబడి పెట్టడానికి ,కో ప్రొడ్యూస్ చేయటానికి నిర్మాణ సంస్ధలు ఎప్పుడూ ఆసక్తి చూపుతూంటాయి. ఆ మధ్యన మహేష్ బాబు ...'1'- 'నేనొక్కడినే 'చిత్రానికి ఫైనాస్ చేసి, కో ప్రొడ్యూస్ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఇప్పుడు మరోసారి తెలుగులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.
పవన్ తో ' గబ్బర్ సింగ్ 2' నిర్మిస్తున్న శరత్ మరార్ తో వారు కలిసి ఈ నిర్మాణంలో పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఈ చిత్రానికి వారు కో ప్రొడ్యూస్ చేయటానికి చర్చలు జరిపారని, పవన్ వంటి హీరో చిత్రానికి బిజినెస్ నుంచి అన్ని విషయాల్లో సమస్య ఉండదని భావించి భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకు పవన్ సూపర్ హిట్...అత్తారింటికి దారేది ని సైతం రిలియన్స్ సంస్ధ ఫైనాన్స్ చేస్తూ కో ప్రొడ్యూస్ చేసింది. అలా పెద్ద హీరోల ప్రొడ్యూసర్స్ తో టై అప్ అవుతూ...కార్పోరేట్ సంస్ధలు తెలుగు పరిశ్రమలోకి సైలెంట్ గా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కొంత కాలం అనంతరం ఇక్కడ పరిచయాలు పెరిగి, తెలుగు బిజినెస్ పై అవగాహన వచ్చాక ఇక్కడ స్వంతంగా సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఈరోస్ వారు ఉన్నట్లు తెలుస్తోంది.
'రచ్చ'తో బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంపత్‌నంది దర్శకత్వం వహించే చిత్రమిది. శరత్‌మరార్ నిర్మాత. ''గబ్బర్ సింగ్ కథకూ.. ఈ కథకూ సంబంధం ఉండదు. కానీ ఆ తిక్క మాత్రం ఉంటుంది. అభిమానులకు రెట్టింపు వినోదం అందిస్తాం. స్క్రిప్టు సిద్ధమైంది. పవన్ పచ్చజెండా వూపగానే చిత్రీకరణను మొదలుపెట్టేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు.
హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











