సెక్స్ బాంబ్ సేవలో ఈటీవీ ఫ్రభాకర్
సుమన్ నుంచి విడిపోయి బయిటకు వచ్చి సైలెంట్ గా టీవీ సీరియల్స్ చేసుకుంటూ పోతున్న ఈటీవీ ప్రభాకర్ కొలువులో ఇప్పుడు సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ చేరింది. గతంలో వీళ్లద్దరూ ఒకట్రెండు సినిమాల్లో కలిసి చేయటంతో అక్కడ ఏర్పడిన ఆ అనుబంధ వీరిని ఒకటి చేసింది. అందులో భాగంగా ఇప్పుడు ఈటీవీ సుమన్ చేయబోతున్న సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వెనక ప్రభాకర్ మెయిన్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇక ముమైత్ ఖాన్ గతంలో పూరీ క్యాప్ లో చాలాకాలం కొనసాగింది.
కానీ తెలుగులో హిట్స్ లేక పూరీ హిందీకి వలస పోవటంతో ఆమె ఖాళీ పడింది. అందులోనూ ఆమె ప్రధాన పాత్రలో చేసిన మంగతాయారు టిఫెన్ సెంటర్, మైసమ్మ ,పున్నమి నాగు వంటి చిత్రాలు భక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ అవటం ఆమెను నిరుత్సాహపరిచింది. ఆమెకు ఐటం గర్ల్ గానూ ఆఫర్స్ రావటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె కు అండగా ప్రబాకర్ నిలబడ్డాడని తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో టీవీ సీరియల్ ప్లాన్ చేయటానికి ప్రభాకర్ ప్రపోజల్ పెడితే కాదన్న ఆమెను సినిమా ద్వారానే లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి సుమన్ ద్వారా ఆమెను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











