»   » రామోజీరావుకి 'నాన్ స్టాప్'గా తలనొప్పులు తెచ్చిపెడుతోన్న ది గ్రేట్ క్రియేటర్ సుమన్..!!

రామోజీరావుకి 'నాన్ స్టాప్'గా తలనొప్పులు తెచ్చిపెడుతోన్న ది గ్రేట్ క్రియేటర్ సుమన్..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈటీవీ సుమన్ గా అందరికీ సుపరిచయం అయిన రామోజీరావుగారి కుమారరత్నం సుమన్ బాబు. బుల్లితెరపై తన క్రియేటివిటీని చాటుకున్న ఆయన తాజాగా వెండితెరపై తన అద్భుతమయిన, అనన్యసామాన్యమయిన (అని ఆయన గారి అభిప్రాయం మరి) క్రియేటివిటీని చూపించడానికి తొలుత చిలిపి కృష్ణుడిగా అవతారంఎత్తి ఉషాపరిణంతో మనముందుకొచ్చి ఛీ కొట్టించుకున్నాడు. ఆపై సుమన్ మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నాడంట అనగానే ప్రేక్షకుల్లో గుబులు మొదలయింది. మరీసారి ఏ విధంగా రెచ్చిపోయి మనల్ని చంపుతాడో అని.

అందరూ అనుకున్నట్టుగానే నాన్ స్టాప్..కామెడీ అనే సినిమాను తీసి ప్రేక్షకులు నాన్ స్టాప్ గా పరిగెత్తేలా తన క్రియేటివిటీ విశ్వరూపాన్ని చూపించాడు. ఇందులో ఆయనకి ధీటుగా ఇంద్రనాగ్ అనే మరో సీరియళ్ల నటుడు కూడా క్రియేటివిటీ హెడ్ గా అవతారం ఎత్తి వెండి తెరపై, ప్రతీరోజూ పేపర్లలో కనిపించాలనే తన దురదను తీర్చుకున్నాడు. అంతకు ముందు క్రియేటివిటీ హెడ్ గా వున్న ప్రభాకర్ తో కూడా సుమన్ ఇదే విధంగా ఓ సినిమాను ప్లాన్ చేసాడట, ఉషాకిరణ్ మూవీస్ పై ఈ సినిమా తీయాలని సంకల్పించారట. కానీ ఎన్నో అద్భుతమయిన సినిమాలను అందించిన ఉషాకిరణ్ బ్యానర్ వ్యాల్యూని తగ్గించడం ఇష్టంలేక రామోజీరావు కాదనడంతో మరుసటి రోజే సాక్షి పత్రికలో తన తండ్రి మీద ఆక్రోశాన్ని వెలగగ్గాడు సుమన్. దీంతో రామోజీరావు చేసేది లేక సుమన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద సినిమాలు తీసుకో అని డబ్బు అందజేసాడట. కానీ ప్రభారక్ వంటి మోసగానితో వద్దని హితవుపలికాడట. ఎందుకంటే మహామేధావి ప్రభాకర్ గారు సుమన్ గారి పొగడ్తలకు పొంగిపోయే బలహీనతను ఆసరాగా చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి ఈయన కూడా చాలా రెచ్చిపోయారు మరి.

దీంతో సుమన్ కు ప్రభాకర్ లేని లోటును ఇంద్రనాగ్ భర్తీ చేసాడట( పొగడ్తలతో ఉబ్బించి ఆ స్థానాన్ని పొందాడని సమాచారం ). ఈ విశయం తెలిసిన చాలా మంది ఔత్సాహికులు సుమన్ గారూ ఈ కథ మీకోసమే తయారు చేసింది. మీరు తప్ప ఈ కథకు ఎవ్వరూ సరిపోరని ఆయన్ని ఉబ్బిస్తూ సినిమాకు కమిట్ అయ్యేలా రెచ్చగొడుతున్నాడట. దీనికి మాగొప్ప క్రియేటివ్ హెడ్ వున్న ఇంద్రనాగ్ సాయం చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రామోజీరావు ఎక్కడ తన సుపుత్రుడు బయటివారి సినిమాలు ఒప్పుకొని తన పరువు తీస్తాడోనని భయపడుతున్నాడట. పోనీ గట్టిగా చెబుదామా అంటే ఎక్కడ ఇంద్రనాగ్ తో కలసి మరో సాక్షి డబుల్ ధమాకాకు సిద్ధమవుతాడోనని భయపడుతున్నాడట. సాక్షి పత్రిక వారు కూడా సుమన్ ఇంటి చుట్టూ పచార్లు కొడుతున్నారట....మరో డబుల్ ధమాకా ఎప్పుడా అని..!!??

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu