ఈ టీవీ సుమన్ మరో ట్విస్టు

By Staff

Suman
తండ్రి రామోజిరావు పై ఆ మధ్యన సాక్షి పేపరుకెక్కిన ఈ టీవీ సుమన్ ఈ సారి తన ప్రతిభను మరో కోణంలో ప్రదర్శించనున్నారు. తనే ప్రధాన పాత్రలో ఓ పౌరాణిక చిత్రానికి అంకురార్పణ జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రిపై పోరుసాగించిన భక్త ప్రహ్లాదుడు కథ అది అని తెలుస్తోంది. ఆ కథలో ప్రహ్లాదుడు ఎలా ఎదిగాడు..ధర్మ రాజ్యాన్ని ఎలా స్ధాపించాడన్న కొనసాగింపు కూడా ఉంటుందని వినపడుతోంది.

అలాగే ఆ చిత్రంలో విష్ణుమూర్తిగానూ, ప్రహ్లాదుడుగాను కనిపించనున్నాడని, పనిలో పనిగా స్క్రిప్టు రాసి మరీ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మెగా మైథిలాజికల్ ఫిల్మ్ ని టోటల్ గా గ్రాఫిక్స్ తో నింపటానికి ఓ ప్రక్క సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమన్ తన ప్రతిభా పరిమళాలు మరో సారి ప్రపంచానికి గుర్తు చేసినట్లుంటుందని, తండ్రి పై కోపాన్ని తీర్చుకున్నట్లు ఉంటుందని చెప్తున్నారు. సొంతంగా నిర్మించే ఈ చిత్రం వివరాలు అతి త్వరలోనే బయిటకు అధికారంగా రానున్నవి. ఇక ఈ ప్రాజెక్టులో సుమన్ చిరకాల మిత్రుడు ఈటీవీ ప్రభాకర్ పాత్ర ఏమిటన్నది తెలిసి రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X